కరీంనగర్ జిల్లా: గన్నేరువరం మండలంలోని హన్మజీపల్లి గ్రామంలో ఇటీవల ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మరణించిన పెద్దపల్లి రాజు కుటుంబాన్ని రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సంయుక్త కార్యదర్శి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి, పరామర్శించి రూ.5 వేల ఆర్థిక సహాయం చేసి వారి కుటుంబానికి భవిష్యత్తులో అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది..ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్కు ఉపేందర్ రెడ్డి, హనుమాజిపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు పారునంది సంజీవ్, హన్మసుల చంద్రారెడ్డి, గూడ రవీందర్ రెడ్డి , నాగయ్య, రజాక్, అమ్మిగల్ల అజయ్ , పర్షరాములు,దేవ, శ్రీశైలం, నారాయణ రెడ్డి,దుడ్డు మల్లేశం,హనుమాసుల ఎల్లారెడ్డి, గ్రామ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
