contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Manakondur: బీఆర్ఎస్ కు భారీ షాక్

  •  పార్టీ వీడిన మాజీ సర్పంచులు
  •  కాంగ్రెస్ కండువాలు కప్పిన కవ్వంపల్లి

 

కరీంనగర్ జిల్లా:మానకొండూర్ నియోజకవర్గ రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రజల్లో విశ్వాసం కోల్పోతున్న బీఆర్ఎస్ కు, రోజుకో షాక్ తగులుతున్న పరిస్థితి నెలకొంది. తాజాగా ఇల్లంతకుంట మండలానికి చెందిన పలువురు మాజీ సర్పంచులు, ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీకి గుడ్‌బై చెబుతూ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

బుధవారం ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నూతనంగా చేరిన నేతలకు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి మాట్లాడుతూ “కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలు, ప్రగతిశీల పాలన ప్రజల్ని ఆకట్టుకుంటున్నాయన్నారు. పార్టీ బలోపేతానికి ఎవరు కష్టపడి పనిచేస్తారో వారికి తగిన గౌరవం లభిస్తుంది. పార్టీ అంతర్గత వ్యవహారాలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని, బహిరంగ వేదికలపై మాట్లాడవద్దు” అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరూ కలిసి మెలిసి కృషి చేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో తిప్పాపూర్ గ్రామ మాజీ సర్పంచులు దమ్మని లక్ష్మి-లక్ష్మణ్, బొల్లవేణి మంజుల-రమేశ్, గాలిపెల్లి మాజీ సర్పంచులు అరుకుటి విజయలక్ష్మి-మల్లేశం, న్యాత పోచయ్య, జవారిపేట మాజీ సర్పంచ్ పల్లె శ్రీలత-రాజశేఖర్, ఉప సర్పంచ్ కొడుముంజ తిరుపతి,గాలిపల్లి ఉప సర్పంచ్ కాలువ దామోదర్, ఆ పార్టీ నాయకులు అయ్యన్నగారి భగవాన్ రెడ్డి, నర్సింహారెడ్డి,దండి మల్లేశం, దశనం ఆంజనేయులు, జవారిపేట నుంచి పల్లె ప్రణయ్ కుమార్,తిప్పాయపల్లి నుంచి బెజ్జంకి రమేశ్, జేరిపోతుల పౌలు, బెజ్జంకి తిరుపతి, సిరవేణి మహేశ్, బి.యాది మల్లయ్య, ఏగుర్ల నర్సయ్య, ఏగుర్ల బాలయ్య, దమ్మని రాజు, దమ్మని అభినవ్, జేరిపోతుల కిషన్, అబ్బసాని మల్లయ్య, కొడిముంజ సత్తయ్య, సాంబ మంజుల, బొల్లవేణి నర్సయ్య తదితరులు ఉన్నారు.

ఈకార్యక్రమంలో ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, పీసీసీ కోఆర్డినేటర్ పాశం రాజేందర్ రెడ్డి, మండల పరిషత్ మాజీ అధ్యక్షులు ఊట్కూరి వెంకటరమణారెడ్డి, గుడిసె అయిలయ్య యాదవ్, సింగిల్ విండో మాజీ చైర్మన్ ఐరెడ్డి మహేంద్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షురాలు జ్యోతి, పార్టీ నాయకులు ఎలగందుల ప్రసాద్, పసుల వెంకటి, చిట్టి ఆనంద్ రెడ్డి, ఆకుల సత్యం, యాదవ రెడ్డి, తీగల పుష్పలత, కె.మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :