తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా అమరులైన యోధుల స్ఫూర్తితో మన హక్కులకై ఉద్యమించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు సుతారి రాములు పిలుపునిచ్చారు. జగిత్యాల జిల్లా కోరుట్ల డివిజన్ కేంద్రంలోని సి నారాయణరెడ్డి కళాభవన్ ఆవరణలో తెలంగాణ అంగన్వాడి టీచర్ స్ మరియు హెల్పర్స్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముందుగా ఈనెల 11 నుండి 17 వరకు జరిగే వారోత్సవాల సందర్భంగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు మాజీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా పార్లమెంట్ సభ్యుడు బద్దం ఎల్లారెడ్డి, నల్గొండ జిల్లా పార్లమెంట్ సభ్యుడు రావి నారాయణరెడ్డి, కవి రచయిత ఎమ్మెల్సీ మద్దుమ్ మొయినుద్దీన్ , నైజాం నవాబ్ పరిపాలనలో రజాకార్ల గుండాలకు తొలి అమరుడైన దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ లకు పూలమాలలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి హెల్పర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.సాయిస్వరి, ప్రధాన కార్యదర్శి నండూరి కర్ణకుమారి, సుమలత, పద్మ, గంగమణి, హిమగిరి లక్ష్మి, రాధా, ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎండి సమీర్ పుల్గం, గోపాల్ తదితరులు పాల్గొన్నారు
