మంచిర్యాల జిల్లా.. కోటపల్లి మండలం దేవులవాడ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గోదావరి నదీ స్నానానికి వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందగా గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, దేవులవాడ గ్రామానికి చెందిన అట్టల బక్కయ్య(50) అనే వ్యక్తి ఎర్రాయిపేట గ్రామ సమీపంలోని గోదావరి నదీలో స్నానం ఆచరించేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయాడు. విషయం తెలుసుకున్న కోటపల్లి ఎస్సై సురేష్ సంఘటనా స్థలానికి చేరుకొని బక్కయ్యను ఈతగాళ్ళతో వెతికించి బక్కయ్యాను వెలికి తీయించారు. అప్పటికే బక్కయ్య మృతి చెందగా, పోస్టుమార్టం నిమిత్తం చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, గోదావరి నదిలో ఇసుక క్వారీల కాంట్రాక్టర్లు పరిమితికి మించి ఇసుక తవ్వకాలు జరిపిన కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని, బక్కయ్య మృతికి ఇసుక క్వారీల కాంట్రాక్టర్లే బాధ్యత వహించాలని, నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తవ్వకాలు జరిపిన కాంట్రాక్టర్లపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. మృతిడి భార్య బుజ్జక్క పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ పేర్కొన్నారు.
