- తిరునాళ్లలో అధికారుల చేతివాటంతో నష్టాల పాలైన చిరు వ్యాపారులు
పల్నాడు జిల్లా, కారంపూడి : పల్నాటి ఉత్సవాలు అంటే ముందుగా సంబర పడేది సంచార వ్యాపారులు ఉత్సవాలలో వ్యాపారాలని ఏర్పాటు చేసుకుంటే ఎంతోకొంత ఆదాయం వస్తుందని కళలుకన్నా సంచార వ్యాపారులకు నష్టలతో కన్నీళ్లని మిగిల్చి కంటతడితో తమ తమ గ్రామాలకు వెళ్ళవలసిన పరిస్థితి ఈ సారి తిరునాళ్లలో సంచార వ్యాపారులకు కలిగింది. ఇక్కడ వ్యాపారం ఏర్పాటు చేసుకోవడానికి వచ్చే వ్యాపారుల వద్ద కొన్ని శాఖల అధికారులు చేతివాటాన్ని ప్రదర్శించడంతో ఆమ్మో ఇక పల్నాటి ఉత్సవాలకు రాకూడదు రా బాబు అంటూ వ్యాపారులు భయపడవలసిన పరిస్థితి ఈసారి ఉత్సవాలలో దర్శనం ఇచ్చిందని చెప్పవచ్చు. ఈసారి ఉత్సావాలలో ఎద్దుల పందెలు, సంస్కృతిక కార్యక్రమలు లేకపోవడంతో జనం కూడా ఉత్సవాలకు పెద్దగా రాలేదని తెలుస్తుంది. తిరునాళ్లలో ఎగ్జిబిషన్ సంబంధించి నాలుగు ఐదు రకాల ఐటమ్స్ వచ్చినప్పటికి ఇక్కడ ఎగ్జిబిషన్ వ్యాపారులు కూడా తిరునాళ్లలో పూర్తిగా నష్టాల పాలై నష్టాలతో వెనుతిరగవలసిన పరిస్థితి ఈసారి కనబడింది. ఎక్కడెక్కడో నుంచి సంచార వ్యాపారులు చేసుకునేందుకు ఇక్కడ వ్యాపారులు వస్తే ఇక్కడ రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు వారిని బెదిరించి విఐపి ల పేరుతో ప్రత్యేక పాసులు పొంది వారిని ఇబ్బంది పెట్టారన్న ప్రచారం కూడా కారంపూడిలో జోరుగా సాగుతుంది. కారంపూడికి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఎగ్జిబిషన్ సిబ్బంది వద్ద ఏకంగా 400 పాసులు 25వేల రూపాయల నగదు తీసుకున్నట్లు సమాచారం. ఇలాంటి ప్రజాప్రతినిధుల వలన రానున్న కాలంలో ఉత్సవాలకు రావాలి అంటే సంచార వ్యాపారులు భయపడవలసి వస్తుందని తెలుస్తుంది. తిరునాళ్లలో ఏర్పాటు చేసిన షాపుల వద్ద కూడా పంచాయతీ అధికారులు ఒక ప్రజాప్రతినిధి ఆదేశాల మేరకు ఎటువంటి రసీదు లేకుండా 500 నుండి 1000 రూపాయల వరకు ఒక్కొక్క షాపుకు వసూలు చేసినట్లు సమాచారం. అధికారులు, పంచాయతీ వారే కాకుండా కొందరు రాజకీయ నాయకులు కూడా పంచాయతీ స్థలాలు కేటాయించడంలో సంచార వ్యాపారుల వద్ద భారీగా దండుకున్నట్లు సమాచారం. ఏది ఏమైనా పల్నాటి వీరుల కొనతల ఉత్సవాలు సంచార వ్యాపారులకు నష్టం కలిగించినప్పటికి ప్రజాప్రతినిధులకు జేబులు నింపాయని చెప్పవచ్చు.