పల్నాడు జిల్లా కారంపూడి : ఈ నెల 27 న వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా మండపాల వద్ద ఏర్పాటు చేసే వినాయక విగ్రహాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని కారంపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) టీవీ శ్రీనివాసరావు తెలిపారు. కారంపూడి సర్కిల్ సీఐ కార్యాలయంలో అయన విలేకరులతో మాట్లాడుతూ కారంపూడి సర్కిల్ పరిధిలోని కారంపూడి, దుర్గి, రెంటచింతల మండల పరిధిలో ఏర్పాటు చేయనున్న వినాయక విగ్రహాల మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు విద్యుత్, పంచాయితీ,అగ్నిమాపక శాఖల అనుమతి తప్పసరిగా తీసుకోవాలన్నారు. వినాయక మండపాలు,నిమజ్జన ఊరేగింపులో డీజేలకు అనుమతి లేదన్నారు. విగ్రహాలు ఏర్పాటు చేసే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఆయా ప్రభుత్వ శాఖ ల నుంచి అనుమతులు తీసుకోవాలని కోరారు. విగ్రహం ఏర్పాటుకు పరిమిషన్ కు మీసేవ ద్వారా లేదా పోలీస్ స్టేషన్ లో తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వాసు ఇతర పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
