కారంపూడి మండలం పరిధిలోని పలు గ్రామాల పోలింగ్ కేంద్రాలను పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓటు వేయటానికి వచ్చే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉన్నట్టు అధికారులుకు తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేవిధంగా చూడాలని, ఎన్నికల రోజు సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ను ఆపేయాలంటూ సూచించారు.
