సూపర్ స్టార్ కృష్ణ మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా తెలుగులో సంతాపాన్ని ప్రకటించారు. ‘కృష్ణ గారు తన అద్భుత నటనా కౌశలంతో, ఉన్నతమైన, స్నేహపూర్వకమైన వ్యక్తిత్వంతో ప్రజల హృదయాలను గెలుచుకున్న ఒక లెజెండరీ సూపర్ స్టార్. ఆయన మృతి సినీ ప్రపంచానికి తీరని లోటు. ఈ విషాదకర సమయంలో మహేశ్ బాబుకు, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి’ అని ట్వీట్ చేశారు.
మరోవైపు రాహుల్ గాంధీ స్పందిస్తూ.. తెలుగు సినిమా సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ గారు మరణించారనే వార్తతో చాలా ఆవేదనకు గురయ్యానని చెప్పారు. ప్రజా జీవితంలో ఎలా ఉండాలనే దానికి ఆయన వృత్తిపరమైన క్రమశిక్షణ, విలువలు ఒక ఉదాహరణగా నిలిచిపోతాయని అన్నారు.
ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా జాతీయ అధ్యక్షులు వి.సుధాకర్ సూపర్ స్టార్ కృష్ణ కుటుంబసభ్యులకు, స్నేహితులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని ట్వీట్ చేసారు .
Deeply saddened by the news of the passing away of Telugu Cinema Industry Super Star Krishna Garu.
My heartfelt condolences to his family, Friends and Fans @urstrulyMahesh pic.twitter.com/kiRvGbj5nr— V.Sudhakar |Chairman | Print & Electronic Media (@Sudhakarpress) November 15, 2022