contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాలను ప్రభుత్వం కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంది: మంత్రి కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లా: స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాలను ప్రభుత్వం కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుందనీ మంత్రి కే తారక రామారావు అన్నారు.శుక్రవారం మంత్రులు కేటీఆర్,శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే రసమయితో కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకొని సిరిసిల్ల మొదటి బైపాస్ రోడ్డులో నర్సింగ్ కళాశాల కూడలిలో సిరిసిల్ల మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలోని కే కన్వెన్షన్ పంక్షన్ హల్ ప్రారంభించి , మధ్య మానేరులో పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన బోటింగ్ యూనిట్ నీ ప్రారంభించారు.అనంతరం పద్మనాయక కళ్యాణ మండపంలో సర్వాయి పాపన్న గౌడ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కే తారక రామారావు మాట్లాడారు.జిల్లా గౌడ సంక్షేమ సంఘానికి రెండెకరాల భూమిని కేటయించి, సంఘ భవన నిర్మణానికి రెండు కోట్ల నిధులు మంజూరు చేశారు.ఈ సందర్భంగా మంత్రులు కేటీఆర్ మాట్లాడుతూ మహోన్నత ఆత్మగౌరవ పోరాటం చేసిన యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ అని,అదే తరహాలో ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ ఉద్యమం చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించారని అన్నారు. రాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వమని, అన్ని వర్గాల ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నామన్నారు. అన్ని కులవృత్తులకు పెద్దపీట వేస్తున్నామని, ప్రమాదాలు జరగకుండా మోడ్రన్ మోకుల పంపిణీ సిరిసిల్ల నుంచే చేపడతామన్నారు.వచ్చేనెల సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మల్కపేట రిజర్వాయర్ ప్రారంభం కానుందని,కాళేశ్వరం ప్రాజెక్టు తో 365 రోజులు మానేరులో నీరు పారుతుందన్నారు.టాటా, బిర్లాలే కాకుండా,తాతల నాటి కులవృత్తులు బతకాలనేదే సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు. రానున్న రోజుల్లో అన్ని జిల్లాల్లో నీరా కేఫ్ లను ప్రారంభించాలని ప్రభుత్వం ఆలోచిస్తుందన్నారు. విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు ప్రభుత్వం 25 లక్షలు స్కాలర్షిప్  అందిస్తున్నామన్నారు. జిల్లాలో 50 ఏళ్ల నుంచి తాగునీరు గోస  ఉండేదని, కాళేశ్వరం నీళ్ళు తెచ్చి,జిల్లాలో మత్స సంపదను పెంచామన్నారు. జిల్లాలో ఎక్కడైనా ఖాళీ స్థలం అందుబాటులో ఉంటే సొసైటీలకు కేటాయిస్తామన్నారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సిరిసిల్ల కోనసీమ,పాపికొండల మాదిరిగా మారి, బలగం, రుద్రంగి సినిమాలు సిరిసిల్లలో తిస్తున్నారన్నారు.గీత కార్మికుల సంక్షేమాన్ని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని,సీఎం కేసీఆర్ గీత కార్మికుల బతుకులకు భరోసా కల్పిస్తున్నారని,ట్యాంక్ బండ్ పై మూడు కోట్లతో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెట్టబోతున్నారాన్నారు.. ఉమ్మడి ఆంధ్రా రాష్ట్రంలో కళ్లు వృత్తిని నిషేధించారని, కళ్ళు గీత కార్మికుల పన్ను రద్దు చేసిన ఘనత సీఎం కేసీఆర్  దేనన్నారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరినిచ్చిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా అని,సిరిసిల్ల ప్రజలు చైతన్యవంతమైనవారన్నారు.తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని,పేదల పక్షాన నిలిచే నాయకులకు అండగా నిలవాలని,మనందరి బాగు కోసం ప్రజా ప్రభుత్వాన్ని కాపాడుకోవాలన్నారు. అభివృద్ధి నీ చూసి ఓర్వలేకే కెసిఆర్ పై అనుచిత వ్యాఖ్యలు  చేస్తున్నారని, మాయమాటలు చెప్పే వాళ్ళ పట్ల మనం అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.గౌడ సంక్షేమానికి ఎంతో మేలు చేసిన ఈ ప్రభుత్వానికి గౌడన్నలు అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, రాష్ట్ర పవర్ లూమ్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్, టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు,జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు శంకరయ్య, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గడ్డం నరసయ్య, మునిసిపల్ చైర్మన్ కళా చక్రపాణి, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ,ఆయా శాఖలకు సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధులు,గౌడ కమ్యూనిటి ప్రతినిధులు పాల్గొన్నారు.

స్వయంగా బోటు నడుపుతూ… మధ్య మానేరు అందాలను తిలకిస్తూ..

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యాటక రంగాన్ని పటిష్టపరిచేందుకు పలు అభివృద్ధి పనులను తెలంగాణ పర్యాటక శాఖ ఇప్పటికే చేపట్టింది.ఇందులో భాగంగా పర్యాటకులను ఆకట్టుకునేలా మధ్య మానేరు జలాశయం అందాలను వీక్షిస్తూ బోటింగ్ చేసేందుకు వీలుగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోటింగ్ యూనిట్ ను మంత్రులు వి. శ్రీనివాస్ గౌడ్, కేటీఆర్ ప్రారంభించారు.
అనంతరం మంత్రి కే తారక రామారావు స్వయంగా బోటు నడుపుతూ…మధ్య మానేరు అందాలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ , జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, స్థానిక ప్రజా ప్రతినిధులు తిలకించారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :