నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి భూ ఆక్రమణకు పాల్పడిన తీగలగుట్టపల్లి మాజీ ఎంపీటీసీ కొమ్ము భూమయ్య మరియు గుంజ లక్ష్మణ్ లను కరీంనగర్ రురల్ పోలీసులు అరెస్ట్ చేసారు.
కరీంనగర్ జిల్లా: నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి, అక్రమంగా భూకబ్జాకి పాల్పడిన మాజీ ఎంపీటీసీ కొమ్ము భూమయ్య మరియు మరో వ్యక్తి గుంజ లక్ష్మణ్ లు ఈనెల 01 వ తేదీ గురువారం నాడు అరెస్ట్ కాబడి కోర్టులో హాజరు పరచగా, మేజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించగా ప్రస్తుతము కరీంనగర్ జైలులో వున్నారు. ఇదిలా ఉండగా ఈ కేసులో తదుపరి విచారణ కోసమై కరీంనగర్ రూరల్ పోలీసులు నిందితులిద్దరిని జైలు నుండి బుధవారంనాడు ఉదయం 10 గంటలనుండి గురువారం ఉదయం 10 గంటల వరకు అనగా 24 గంటల పోలీస్ కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో భాగంగా దీటి మధు ఇంటిస్థలం ఆక్రమణకు పాల్పడినందుకు నమోదుకాబడిన కేసులో మరింత విలువైన సమాచారం సేకరించేందుకు ఇద్దరు నిందితులైన కొమ్ము భూమయ్య మరియు గుంజ లక్ష్మణ్ ల, తీగలగుట్టపల్లిలోని ఇరువురి ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కేసుకు సంబందించిన విలువైన ఇతర డాక్యుమెంట్ లు మరియు ఇతర ఆధారాలు సేకరించారని సమాచారం.