contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

Bollapally : వైసీపీ నేత భూ బాగోతం .. !

ఈ వైసీపీ నేతలు భూములు స్వాహానే పనిగా పెట్టుకున్నారు. అసైన్డ్ భూమి, చుక్కల భూమి, ఇనామ్ భూమి, అర్బన్ సీలింగ్, పోరంబోకు, వివాదాల్లో ఉన్న పట్టాభూమి.. ఇలా ఎక్కడ అవకాశం దొరికినాసరే జెండా పాతేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో నాయకులు చక్రం తిప్పడం, రాజధాని స్థాయిలో వారికి ఆశీస్సులు లభించడం షరా మామూలుగా మారింది. ఏ ప్రభుత్వ హయాంలోనూ ఎన్నడూ లేనంత స్థాయిలో భూ దందా సాగుతోంది.

గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం మెళ్ళవాగు గ్రామ పంచాయతీ పరిధిలోని లచ్చక్క చేరువు ప్రక్కన తూర్పు భాగంలోని బస్టాండ్ సెంటర్లోని ఏడున్నర ఎకరం స్థలం 1984 సం లో మాదిగల కొరకు ఒక్కొక్కరికి 5 సెంట్లు చొప్పున 70 కుటుంబాల వారికి పట్టాలు మంజూరు చేయడం జరిగింది. గతంలో కొన్ని కుటుంబాలు కొన్ని సంవత్సరాలు నివాసము ఉన్నారు, వసతులు లేని కారణంగా ఖాళీ చేసి మరల పాత పల్లెలో నివాసం ఉంటున్నారు .వారికి వసతులు కల్పించి వారి యెక్క స్థలాలన ఇప్పించాలని అనేక సార్లు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు, వారికి ప్రభుత్వ సహకారం లేని కారణంగా కాలనీ నిర్మాణం జరుగలేదు.

9.10.2017 నాడు దళితుల స్థలంలో బెలుం శ్రీ రామ్ రెడ్డి అనే భూస్వామి మరియు అతని తొత్తులు స్థలాలను స్వాధీన పరుచుకొనుటకు ప్రయత్నించారు. ప్రొక్లెయిన్ ద్వారా తమ పొలంలో ఆ స్థలాలను కలుపుకొనుటకు చదును చేయుచుండగా దళితులు ఆ ప్రదేశానికి వెళ్లి నిలదీశారు. ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది మీ చేతనైనది చేసుకోండి అని దళితులను బెదిరించారు. ఇందులో ముఖ్యుడు బెలుం శ్రీరామ్ రెడ్డి ( వై యస్ ఆర్ సి పి) మరియు వై యస్ ఆర్ సి పి మద్దతు దారులు, చెవుల శ్రీనివాస రావు, చెవుల లక్ష్మికాంతం మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని నానా దుర్భాషలాడారు, మీకు చేతనైంది చేసుకోండి అని కంప్లైంట్ ఇస్తే మీ అంతు చూస్తామని పట్టా దారులులను బెదిరించారు.

ఈ సంఘటన జరిగిన వెంటనే బొల్లాపల్లి మండల ఎమ్మార్వో సాంబశివ రావు దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. అయినా కానీ బాధ్యత కలిగిన ఎమ్మార్వో ఏవిధమైనటువంటి చర్యలు తీసుకోలేదు .ఎమ్మార్వో అలసత్వం వలన కబ్జా దారులు రోజు రోజుకి అక్కడ వారి పనులు చేసుకుంటూ పోయారు. నవంబర్ 6 .2017 న గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ బాబు కి మీడియా ప్రథినిధులు కలిసి దళితుల భూ కబ్జా విషయం లో వినతి పత్రాన్ని సమర్పించి , కబ్జా కి సంబంధించిన విషయాలు వివరించడం జరిగింది . కలెక్టర్ శశిధర్ బాబు వెంటనే ఎమ్మార్వో సాంబశివ రావు కి ఆ స్థలాల ని పరిశీలించి రీ సర్వే చేయించి న్యాయం చేయమని చెప్పారు కానీ రెండు నెలలు అయినా గాని ఎమ్మార్వో సాంబశివ రావు , మేళ్ళవాగు విఆర్వో స్పందించగా పొగ కబ్జాదారులకు తొత్తులుగా పని చేసారు. కలెక్టర్ ఆదేశాలకు ముందు అక్కడ కబ్జాదారులైన బెలుం శ్రీరామ్ రెడ్డి చెవుల శ్రీనివాస్ పనులు చేపట్టారు , కలెక్టర్ ఆదేశాల తరవాత కూడా ఇంకొద్దిగా పనులు వేగావంతం చేసారు . కలెక్టర్ ఆదేశాలను కూడా లెక్కచేయకుండా కబ్జాదారులు ఎమ్మార్వో, విఆర్వ అండదండలతో పనులు ఆపకుండా ఇంకొద్దిగా వేగవంతం చేసారు. అక్కడ పనులు జరగడం తెలిసిన మీడియా ప్రతినిధి ఎమ్మార్వో తో మాట్లాడితే ఆపేసారు. ఈ లోపులో కబ్జాదారులైన చెవుల శ్రీనివాస్ రావు ,బెలుం శ్రీరామ్ రెడ్డి మాకు ల్యాండ్ ఉందని వారి దగ్గర ఉన్న నకిలీ పాస్ పుస్తకం తో ఎమ్మార్వో ,విఆర్వో సహకారం తో శావల్యాపురం నుండి మహిళా సర్వేయర్ ని పిలిపించుకొని వారికి అనుకూలంగా సర్వే చేయించు కున్నారు . చుట్టుపక్కల పొలాల వారికి నోటీసులు ఇచ్చి వారిని పిలిచి వారి సమక్షం లో సర్వే జరపాలి కాని దానికి భిన్నంగా పట్టాదారులైన మాదిగలకు మేళ్ళవాగు వి.ఆర్.ఓ కబ్జాదారుల తరపున నోటీసులు ఇచ్చి నాలుగు రోజుల క్రితం సర్వే కి రావాలని చెప్పాడు కాని చెప్పిన రోజు సర్వే జరపకుండా అనగా 30 డిసెంబర్ 2017 న సర్వే చేస్తున్నారని మేళ్ళవాగు విఆర్వో దళితులను పిలిచాడు . బొల్లాపల్లి మండలానికి సంబందించిన సర్వేయర్ రాకుండా శావల్యాపురం మహిళా సర్వేయర్ ని పంపించారు , సర్వే జరిగేటప్పుడు బొల్లాపల్లి మండలం ఎమ్మార్వో మరియు మేళ్ళవాగు విఆర్వో అక్కడ లేరు.

శావల్యాపురపు మహిళా సర్వేయర్ కు సర్వే లో తప్పులు వస్తున్నాయని దళితులూ అంటుంటే నా లెక్కలు ఇంతే నచ్చకపోతే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి . రాళ్లు పీకితే కేసులు పెడతా అని బెదిరించి వెళ్ళింది . చెవుల శ్రీనివాస్ దగ్గర ఉన్నది నకిలీ పాస్ పుస్తకమని ఆడంగులు పహాణీలు లేవని ఎంత చెప్పిన వినకుండా నేను చేసేది ఇంతే ఎవరికి కంప్లైంట్ ఇచ్చుకుంటారో ఇచ్చుకోండి అని వెళ్ళిపోయింది .ఈ సర్వే కి మేళ్ళవాగు మోతాదు సోము నరసింహ రావు సర్వే హద్దులు తెలిసికూడా అవకతోవకలు చేయించాడు . ఎందుకంటే 2006 – 2017 లో ఈ నకిలీ పాస్ పుస్తక తయారీ ముఖ్యకారకుడు అది మాత్రమే కాక ఈ మధ్యకాలం లో ఆడంగుల పహాణీలలో కూడా పేర్లు నమోదు కు సహకరించిన ముఖ్యుడు సోము నరసింహ రావు .గతం లో నకిలీ పాస్ పుస్తకాలు తయారీలో సోము నరసింహ రావు హస్తముంది దాని వలన గతం లో ఉన్న విఆర్వో కూడా సస్పెండ్ అవ్వడానికి కారకుడు . మేళ్ళవాగు దళితులు మాకు సైరైనా న్యాయం జరగడం లేదని వాపోతున్నారు . దళితుల భూ కబ్జా విషయం లో తగు న్యాయం చేయాలనీ అక్కడి దళితులు కోరుతున్నారు. ఈ విషయాన్ని మరల పరిశీలించి దళితులకు తగు న్యాయం చేయాలనీ. నకిలీ పాస్ పుస్తకాలు అడ్డం పెట్టుకొని చెవుల శ్రీనివాస్ బెలుం శ్రీరామ్ రెడ్డి స్థలాలు స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కావున ముఖ్యమంత్రివర్యులు చొరవ తీసుకొని దళితులకు ఇచ్చినటువంటి పట్టాలను రీ సర్వే చేసి పట్టదారులకు మరల పట్టాలు ఇప్పించమని. మరియు గృహనిర్మాణం ద్వారా గృహాలను నిర్మించి వారికి కావలసిన సదుపాయాలు కరెంటు, నీరు సదుపాయం , రోడ్స్ ఎర్పాటు చెయ్యాలని కోరుతున్నారు. నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించుకుని భూ కబ్జాకు పాలుపడిన వారిపై మరియు వారికి సహకరించిన ప్రభుత్వ అధికారుల పై చట్ట పరమైనటువంటి చర్యలు తీసుకోవాలని దళితులు కోరుతున్నారు.

 

 

 

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :