contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మన్యంలో ‘భూ’ రియల్ మాయ..!

  • పర్యాటకం మాటున వ్యాపార వలస సముదాయాలు
  • ఖాళీ జాగా కనిపిస్తే పాగా
  • ప్రభుత్వా స్థలాల కబ్జాల పరంపర
  • చోద్యం చూస్తున్న అధికారులు

ది రిపోర్టర్ టీవీ న్యూస్ (ఏజెన్సీ ప్రత్యేక ప్రతినిధి): అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఈ పేరు వినగానే గిరిజన అటవీ ప్రాంతం అంటారు.ఈ మధ్యనే పర్యాటకంగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా చెప్పవచ్చు. ఈ ప్రాంతం దినదినాభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో బయట ప్రాంతాల నుంచి వలసలు పెరిగాయి. ఒకప్పుడు నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతం నేడు పర్యాటకులతో కిక్కిరిసిపోతుంది.దింతో పర్యాటకులకు విడది సౌకర్యంగా అతిధి గృహాల నిర్మాణాలు పెరిగి వ్యాపారాలు మూడు రూములుగా ఆరు బోలెరోలుగా సాగుతున్నాయి.ఇది ప్రస్తుతం మారేడుమిల్లిలో కొనసాగుతున్న తంతు.

బినామీల పేరుతో కబ్జాలు..

ఇకపోతే మారేడుమిల్లి ప్రధాన కూడళ్లలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆర్ అండ్ బి స్థలాలు కబ్జాలకు గురై ఈ ప్రాంత ఆదివాసీ గిరిజనులకు నిలువ నీడ లేక రోడ్ల మీద బస్సుల కోసం ,ప్రయివేట్ వాహనాల కొరకు పడిగాపులు కాస్తూ సొమ్మసిల్లిపోతున్న ఘటనలు నెలకొంటున్నాయి.ఈ మన్య ప్రాంతంలో బినామీలను సృష్టించి మరి కబ్జాలకు తెరలేపుతున్నట్టు పలువురు నుండి గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రహదారికి ఇరువైపులా అక్రమంగా ఆక్రమణలు చేసి నిర్మాణాలు చేపట్టారు.చిన్న మధ్య తరహా వ్యాపారాలకు ఇవి అద్దెలకు ఇస్తున్నట్టు సమాచారం.ఖాళీ స్థలంలో ఇక్కడ చిన్న బడ్డీ కొట్టి పెట్టుకోవటానికి నెలకు ఇంతా అని మాట్లాడుకొని పైసాలు వసూలు చేస్తున్నట్టు సమాచారం.మన్యం ప్రాంతం కబ్జాల కొరల్లో చిక్కుకుందని తెలుస్తుంది.ఇంతా జరుగుతున్నా అధికారుల్లో చలనం లేకపోవటం అనేక అనుమానాలకు తావిస్తుంది.

ఇక్కడంతా మైదాన ప్రాంతాల వలసలు ..

మారేడుమిల్లిలో పర్యాటకుల తాకిడి పెరగటంతో వ్యాపారాలు చేసుకోవాటానికి మైదాన ప్రాంతాల నుండి వలసలు పెరుగుతున్నాయి. దింతో మన్యం ప్రాంతంలో ఉన్న భూములు బినామీ కబ్జాల పరంపర కొనసాగుతుంది. కొంతమంది వారి వ్యాపారాల్లో అసాంఘిక కార్యక్రమాలను కూడా ప్రోత్సహిస్తునట్టు వినికిడి.వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేసుకొని స్వచ్ఛమైన మన్యం ప్రాంతాన్ని కలుషితం చేస్తున్నారంటూ స్థానిక గిరిజనులు ఆరోపిస్తున్నారు.

రియల్ మాఫియా..

స్థానిక గిరిజనులు ఊహించిన దానికంటే భూముల రేట్లు అధికంగా పెరగటంతో రియల్ మాఫియా దృష్టి ప్రభుత్వ స్థలాల పై పడింది. నిబంధనల మేరకు వదిలిన రహదారులు ఇతర అవసరాల మేరకు వదిలిన ఖాళీ స్థలాలు ప్రజల అవసరాలకు వినియోగించాల్సి ఉంది. కానీ ఈ భూములు కొంతమంది వ్యక్తులు అప్పనంగా బినామీల పేరుతో కాజేస్తున్నారని ఆరోపణలు మిన్నంటాయి.కాగా ప్రభుత్వ భూములను కాపాడాల్సిన సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు చోద్యం చూస్తున్నారు.కబ్జాదారులకు వంత పాడుతూ.. చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటంతో భూ కబ్జాదారులు దర్జాగా భూ ఆక్రమణలకు పాల్పడుతున్నట్లు స్థానిక గిరిజనలు ఆరోపిస్తున్నారు. దీంతో మన్యం ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ స్థలాలు అన్ని కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని, ప్రభుత్వ పెద్దలకు ఎన్ని ఫిర్యాదులు చేసినబుట్టదాఖలవుతున్నాయని గిరిజన ప్రజలు వాపోతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :