contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మూడు వేల కోట్ల విలువ చేసే భూమి కబ్జా

  • కాసులపై శ్రద్ధ.. విధులపై అశ్రద్ధ..
  • అమీన్ పూర్ లో మూడు వేల కోట్ల విలువ చేసే భూమి కబ్జా
  • రియల్ ఎస్టేట్ కంపెనీ లేకున్నా లేఔట్ పేరుతో అనుమతులు
  • లే ఔట్ కి టైటిల్ లో ఉన్న వాళ్ల పేరు మీద రెవెన్యూ రికార్డే లేదు
  • మున్సిపాలిటీ , టౌన్ ప్లానింగ్ అత్యుత్సాహంతోని ఉట్టిగీతలకు పర్మిషన్లు

 

సంగారెడ్డి, అమీన్ పూర్ : హైదరాబాద్ శివారులోని అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో సుమారు మూడు వేల కోట్ల విలువచేసే ఐఈసీ- ఓఫీ హెచ్ బీఎస్ భూములను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కుమ్మకై రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ముట్ట చెప్పారు. అమీన్ పూర్ లో రియల్ ఎస్టేట్ కంపెనీ లేకున్నా ‘కె యస్ ఆర్’ నిర్మాణ మరియు రియల్ ఎస్టేట్ సంస్థ పేరుతో లే అవుట్ తయారు చేసినట్లు మున్సిపల్ అధికారులు కార్యాలయంలో కూర్చొని పిచ్చి గీతలకు అనుమతులు ఇస్తూ పోయారు. 1982లో లేఔట్ కి 2007 లోనే అసెస్మెంట్ డీడ్ (లింక్స్ 11986/2007,11985/2007) టైటిల్ లో ఉన్న వాళ్ల పేరు మీద రెవెన్యూ రికార్డే లేదు.. మున్సిపల్ అధికారులతో పాటు టౌన్ ప్లానింగ్ సిబ్బంది కూడా ఉట్టి గీతలకు అనుమతులు ఇవ్వడం చూస్తుంటే అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

వివరాల్లోకి వెళితే …
సంగారెడ్డి జిల్లాలోని, అమీన్ పూర్ మున్సిపాలిటీ లోని మున్సిపల్ కమిషనర్ అవినీతి అక్రమాలకు తెగబడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్ర స్థాయి సిబ్బంది అవినీతి, అక్రమాలకు పాల్పడితే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాల్సిన కమిషనరే, కాసులకు కక్కుర్తి పడి ఏ. ఆర్. డెవలపర్స్ అనే నిర్మాణ సంస్థతో లోపాయికారి ఒప్పందం చేసుకొని అక్రమాలకు పాల్పడుతున్నట్లు బహిరంగ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపాలిటీలో ఎటువంటి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా సజావుగా జరిగేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2019 లో నూతనంగా ప్రవేశ పెట్టిన మున్సిపల్ చట్టం, ఇక్కడ అధికారులు, ప్రజా ప్రతినిధులకు కాసుల వర్షం కురిపిస్తోంది.. అక్రమనిర్మాణాలు పుట్టగొడుగుల్లా పెరిగిపోవడంతో… ఈ చట్టం బ్రష్ట పడుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. అమీన్ పూర్ మున్సిపాల్టీ కేంద్రంగా మున్సిపాల్టీ నుండి అనుమతులు లేకుండా, 2018 కంటే ముందు గ్రామపంచాయితీగా ఉన్న సమయంలోనే ఎటువంటి నిర్మాణాలు లేకున్నా, దొడ్డిదారిలో పొందిన ఇంటి నెంబర్లతో, ప్రస్తుతం అక్రమంగా నిర్మాణ పనులు చేస్తూ.. కోట్ల రూపాయల విలువైన భూములను కొల్లగొట్టేందుకు కుయుక్తులు పన్నుతున్నారని పలువురు పలు విధాలుగా చర్చించుకుంటున్నారు. అమీన్ పూర్ మున్సిపాల్టీ లో ఇంటి నెంబర్లు జారీ చేయాలంటే మొదట ఇంటి నిర్మాణ అనుమతులు పొందాలి.. మున్సిపల్ చట్టం ప్రకారం ఇంటి నెంబర్ పొందాలన్నా, నిర్మాణ అనుమతులు పొందాలన్నా సేల్ డీడ్, లింక్ డాక్యుమెంట్, అక్యుపెన్సీ సర్టిఫికెట్, సెల్ఫ్ డిక్లరేషన్ నిబంధనలతో పాటు చట్టంలో చూపించిన పత్రాలతో ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని చట్టం సూచిస్తోంది.. కానీ మున్సిపల్ చట్టాన్ని ఆ శాఖాలోని కొంతమంది అధికారులే కాలరాస్తూ, అక్రమాలకు తెగబడుతున్నారు. క్షేత్ర స్థాయిలో ఇంటి నెంబర్ కోసం దరఖాస్తు చేసుకున్న ప్రదేశాన్ని క్షుణ్ణంగా పరిశీలించకుండానే అనుమతులు ఇస్తున్నారు. రెవిన్యూ రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమా..? కాదా..? భవనాలు ఉన్నాయా..? లేవా..? అని నిర్ధారణ చేసుకొని, తదుపరి నిర్మాణాలు ఉన్నట్లయితే మున్సిపల్ చట్టానికి లోబడి ఇంటి నెంబర్లు కేటాయించాల్సి ఉంటుంది. నిర్మాణ అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది.. కానీ అవినీతిలో కూరుకుపోయిన మున్సిపల్ కమిషనర్ ఇవన్నీ పట్టించుకోకుండా, అక్రమార్జనే పరమావధిగా భావించి.. విచ్చలవిడిగా అనుమతులు జారీ చేస్తున్నారనే ప్రచారం ఇక్కడ జోరుగా సాగుతోంది.. హైదరాబాద్ శివారు ప్రాంతం కావడంతో.. ఎకరం భూమి విలువ కోట్లలో ధర పలుకుతుండటంతో.. రియల్టర్లు అక్రమ వెంచర్ల నిర్మాణం సాగించి, కోట్లు కోల్లగొడుతున్నారు… ఆ మేరకు అడ్డదారుల్లో అధికారులు, ప్రజా ప్రతినిధులను నడిరోడ్డుపై కొనుగోలు చేసి, తమ అక్రమ కార్యకలాపాలు సజావుగా సాగిస్తున్నారని స్థానికుల ఆరోపిస్తున్నారు.

2018 కంటే ముందు గ్రామ పంచాయితిగా ఉన్న సమయంలో పొందిన ఇంటి నెంబర్లుతో కె యస్ ఆర్ నిర్మాణ మరియు రియల్ ఎస్టేట్ అనే నిర్మాణ సంస్థ, అక్రమాలను సక్రమం చేస్తూ నకిలీ పత్రాలతో అక్రమ లే అవుట్లను చూపుతూ.. యథేచ్ఛగా వక్రమార్గంలో అక్రమ నిర్మాణ పనులు చేస్తుంటే.. కమిషనర్ అటువైపు కన్నెత్తి చూడడం లేదని ఆరోపణలు సైతం వ్యక్తమవుతున్నాయి.. అమీన్ పూర్ మున్సిపాల్టిలో నిర్మాణ అనుమతులు పొందాల్సిన కె యస్ అర్ నిర్మాణ మరియు రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థ, గ్రామ పంచాయితీ ఇంటి నెంబర్లతో ఎలా నిర్మాణ పనులు చేస్తున్నారని..? అటుగా వెళ్లే ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.. అస్సలు కె యస్ ఆర్ నిర్మాణ సంస్థ కి లేఅవుట్ అనుమతులు ఎక్కడ నుండి వచ్చాయి..? సదరు సర్వే నెంబర్ల భూములు ఏ అధికారి కస్టడీలో ఉన్నాయి..? ఈ సర్వే నెంబర్ భూములలో నిర్మాణ పనులు చేయచ్చా ..? అస్సలు కె యస్ ఆర్ నిర్మాణ సంస్థ కి భూములకు సంబంధించి రెవిన్యూ రికార్డులు ఏమి చెపుతున్నాయి..? రెవెన్యూ అధికారులు ఏమి చెబుతున్నారు..కె యస్ ఆర్ నిర్మాణ సంస్థ స్థానిక నాయకుల పాత్ర ఏంటి? అనేది తేలిపోవాలని , రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమీన్ పూర్ భూ కుంభకోణం పై పూర్తి దర్యాప్తు జరపాలని స్థానికులు కోరుతున్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :