contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

అమ్మో… కారంపూడిలో భూ బకాసురులు … పట్టించుకోని అధికారులు !

  • ప్రభుత్వస్థలం కనపడితే గద్దల్ల వాలిపోతున్న వైనం
  • గద్దలను నివారించడంలో అధికారులు విఫలం
  • ఖాళీ స్థలం యజమానులకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్న కబ్జాదారులు
  • ఒక అధికారి సైతం సుమారు ఎకరం నుంచి ఏకరన్నర వరకు స్థలం కబ్జా చేసినట్లు సమాచారం.? కానీ అవి నిరూపించే వారెవ్వరూ వారికి ఎదురు నిలిసి పోరాడేదెవరు?

అధికారుల అండదండలతో కనిపించిన భూమి కబ్జా చేస్తున్నారు ల్యాండ్ మాఫియా. సామాన్యుడు నెత్తి నోరు కొట్టుకుంటున్నా వినడం లేదు. వీఆర్వోల మొదలు తహసీల్దార్లను అడ్డం పెట్టుకుని కబ్జా కాండను సాగిస్తున్నారు. యథేచ్ఛగా భూ దోపిడీకి పాలుపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా కారంపూడిలో ల్యాండ్ మాఫియా పై రిపోర్టర్ టీవీ ఫోకస్. . ఇందుగలరు అందులేరు ఏందేందు వెతికిన ఇంతటి కబ్జాదారులు లేరు అనటానికి నిదర్శనం ఇది . ఇక్కడ ప్రభుత్వస్థలం కనబడితే చాలు గద్దల్ల వాలిపోతున్నారు ఆ గద్దలకు అధికారులు సైతం నీడను ఇస్తునే ఉంటారు. కారంపూడిలో భూముల ధరలకు రెక్కలు వచ్చాయని చెప్పవచ్చు దీనితో ప్రభుత్వం స్థలాలు ఎక్కడ కనబడితే అక్కడ కొందరి కళ్ళు ఎర్రపడతాయి ఆ పైన ఎంచక్క కబ్జా చేస్తారు ప్రభుత్వ స్థలలే కాదు కొన్ని ఖాళీ స్థలాలు కూడా ఎంచక్క కబ్జా చేయటం ఇక్కడ పనిపాటుగా మారాయి దీనితో ఖాళీ స్థలాల యజమానులు కూడా రాత్రి పూట నిద్రపట్టక తమ స్థలాలు ఉన్నాయా కబ్జాకు గురయ్యాయా అని చూసుకోవలసిన పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. ఈ తంతు కారంపూడిలో విపరీతంగా జరుగుతుంది. ఇంత జరుగుతున్న అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారో అర్థంకానీ ప్రశ్నగా మిగిలింది కారంపూడిలోని కొదమగుండ్ల రోడ్డు, నరసరావుపేట రోడ్డు, మాచర్ల రోడ్డు, వినుకొండ రోడ్డు ఇలా నాలుగు దిక్కులు ఈ తతంగం నిత్యం నడుస్తూనే ఉంది. అంతేకాకుండా భూముల స్థలాలు సర్వే నెంబర్ ఒకటి స్థలం మరొకచోట వేరే నెంబర్లు వేసి ఇక్కడ భూములను ఆక్రమించుకొని కొంతమంది సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. ఇక వినుకొండ రోడ్డుకు వస్తే ఎస్ కే ఎఫ్ ఛానల్ పక్కనే కొందరు ఎన్ఎస్పీ స్థలాలను సైతం ఆక్రమించుకున్నప్పటికి వారికీ అధికారులు సైతం మద్దతు పలుకుతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆదినారాయణ కాలనీ ఎదురుగా మైనారిటీ వర్గానికి చెందిన ఒక వ్యాపారి ఏకంగా తన స్థలం పక్కనే ఉన్న పోరంబకును ఆక్రమించుకొని అధికారుల ద్వారా పట్ట కూడా పొందినట్లు విశ్వాసనీయ సమాచారం. అలాగే వినుకొండ రోడ్డులో వాగు పోరంబోకు భూములను సైతం కబ్జాదారులు దర్జాగా ఆక్రమించుకుంటున్నారు. అంతేకాకుండా వినుకొండ రోడ్డు నందు ఖాళీ స్థలాలు కనబడితే కొందరు కబ్జాదారులు ఎంచక్క కబ్జా చేసుకొని తమ సొంతం చేసుకుంటున్నారు. ఇక మాచర్ల రోడ్డుకు వస్తే సాగర్ మెయిన్ కెనాల్ పక్కనే అనుకోని ఉన్న ఎన్ఎస్పి స్థలాలను సైతం భూబకాసులు వదలటంలేదు. కారంపూడికి చెందిన ఒక పెద్దమనిషి ఏకంగా మాచర్ల రోడ్డులో తన స్థలం పక్కనే ఉన్న 50 సెంట్ల ఎన్ఎస్పి స్థలాన్ని ఆక్రమించుకొని అమ్మి సొమ్ముచేసుకున్నరన్నా ప్రచారం కూడా జరుగుతుంది. ఇక పోతురాజు గుట్ట పరిసరాలలో కూడా వివాద స్థలాలలో కట్టడాలు నిర్మిస్తున్న అధికారులు మాత్రం పట్టిపట్టనట్లు వ్యవహారిస్తున్నారు. అంతేకాకుండా కొందరు బడాబాబులు ఈ ప్రాంతంలో వాగు పోరంబకును ఆక్రమించుకొని అమ్ముకున్నట్లు సమాచారం. వీర్ల దేవాలయ సమీపంలో ప్రభుత్వస్థలాలను సైతం కొందరు అమ్ముకుంటున్నట్లు తెలుస్తుంది. కారంపూడిలో గతంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఫైనాన్స్ కంపెనీలు ఉండేవి ఇటీవల కాలంలో ఈ ఫైనాన్స్ కంపెనీలు తమ వ్యాపారాలను నిలుపుదల చేసుకొని రియల్ ఎస్టేట్ రంగం పై పెట్టుబడులు పెడుతుండటంతో ప్రభుత్వ స్థలాలు సైతం అక్రమణకు గురై అమ్మకాలు కూడా జరుగుతున్నాయి. కారంపూడిలో పేదవాడు భూమి కొనలేని పరిస్థితిలో ఉన్నారు ఫైనాన్స్ రంగంలో బాగా సంపాదించిన కొందరు ఫైనాన్సర్లు తమ దెగ్గర డబ్బులు అధికంగా ఉండటంతో లక్ష రూపాయలు విలువ చేసే స్థలాన్ని కూడా పది లక్షలు పెట్టి కొనుగోలు చేస్తున్న పరిస్థితి కారంపూడిలో దర్శనమిస్తున్నాయి.అంతేకాకుండా కారంపూడిలో ప్రభుత్వ అనుమతులు లేకుండా వెంచర్లు వేస్తూ కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు దర్జాగా స్థలాలను అమ్ముకుంటూ ధరలను పెంచి సొమ్ముచేసుకుంటున్నారు. దీనితో పేదవాడికి సొంత ఇంటి కల కలగానే మిగిలిపోయిందని చెప్పవచ్చు. అంతేకాకుండా కారంపూడిలో స్థలాల బ్రోకర్లు కూడా డబ్బున్న సంపన్న వర్గాలను లోబరుచుకొని అమ్మిన వ్యక్తి దెగ్గర కొన్న వ్యక్తి దెగ్గర కమీషన్లు తీసుకుంటూ ఏకంగా రిజిస్టర్ ఆఫీసును శసించే స్థాయికి ఇక్కడ స్థలాల బ్రోకర్లు ఏదిగారు. అంతేకాకుండా వినుకొండ రోడ్డులో సర్వే నెంబర్ ఒక చోట స్థలం ఒక చోట వేరే వేరే నంబర్లతో రిజిస్ట్రేషన్లు కూడా జోరుగా జరుగుతున్నాయి. కారంపూడిలో భూముల ధరలకు రెక్కలు రావటంతో భూకబ్జాదారులు ఎక్కువయ్యారని చెప్పవచ్చు. దీనితో భూవివాదాలు కూడా కారంపూడిలో అధికామయ్యాయి.
ఇప్పటికైనా అధికారులు భూబకాసులను నివరించకపోతే చివరికి స్మశానంలో గజం స్థలం మిగలదన్నా విషయం అక్షరసత్యంగా చెప్పవచ్చు. మరో బ్రేకింగ్ న్యూస్ తో మీ ముందుకొస్తాం … రిపోర్టర్ టివి ని ఫాలో అవ్వండి

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :