contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

లయన్స్ క్లబ్ డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ గా గంట గౌతమ్ నియామకం

  • గన్నేరువరం లియో క్లబ్ ప్రెసిడెంట్ గా దేశరాజు శివ సాయి ఎన్నిక

కరీంనగర్ జిల్లా:ది రిపోర్టర్ టీవీ: ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ అనుబంధంగా ఇంటర్నేషనల్ లియో క్లబ్స్ ఏర్పరిచి యువతను సమాజం పట్ల సేవా భావంతో పలు సేవా కార్యక్రమం చేయుట కొరకు అన్ని రంగాలలో వారికి మంచి అవగాహన కార్యక్రమాలు ఏర్పరిచి అందులో భాగంగా లియో క్లబ్ గన్నేరువరం నుండి డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ మరియు మల్టిపుల్ స్టేట్ డైరెక్టర్ గా గంట గౌతమ్ ఎన్నిక అయ్యారు. గన్నేరువరం లియో క్లబ్ ప్రెసిడెంట్ గా దేశరాజు శివ సాయి, వైస్ ప్రెసిడెంట్ గా పొన్నాల సంతోష్, దేశరాజు అనిల్, సెక్రటరీగా కాలువ నాగరాజు, ట్రెజరర్ గా బుర్ర శశిధర్ గౌడ్ ను లయన్స్ సభ్యులు డిస్ట్రిక్ట్ చైర్ పర్సన్ లయన్ బూర శ్రీనివాస్, జోన్ చైర్ పర్సన్ లయన్ బొడ్డు సునీల్, ప్రెసిడెంట్ లయన్ కాంతాల కొండల్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ లయన్ గొల్లపల్లి రవి, సెక్రటరీ లయన్ బుర రామకృష్ణ, లయన్ తెల్ల భాస్కర్, లయన్ తెల్ల రవీందర్, కాంతా లాంజిరెడ్డి ల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా లియో గంట గౌతమ్ ను సన్మానించడం జరిగింది.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :