మాచర్ల : వినాయక చవితిని పురస్కరించుకుని గ్రామాలలో ఏర్పాటు చేయనున్న గణేష్ మండపాలకు పోలీస్ అనుమతులు తప్పనిసరి అని మాచర్ల రూరల్ సీఐ షేక్ సమీముల్లా అన్నారు. ఆదివారం సిఐ సమీముల్లా విలేకరులతో మాట్లాడుతూ మండపాల నిర్వాహకులు విఘ్నేశ్వరుని విగ్రహం ఎత్తు, కమిటీ సభ్యుల పేర్లను, నిమర్జనం సమయంలో వినియోగించే వాహనం, వాటి డ్రైవర్ల లైసెన్స్ తో కూడిన వివరాలను ముందుగా అందించాల్సి ఉందన్నారు. మండపాలలో పార్టీలకు సంబంధించిన జెండాలు, డీజేలకు అనుమతి లేదన్నారు. పోలీసులు సూచించిన నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే వినాయక విగ్రహ నిమజ్జనం చేయాల్సి ఉంటుందన్నారు. ప్రారంభం నుండి నిమజ్జనం సమయం వరకూ, ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పోలీస్ సూచనలు తప్పకుండా పాటించాలని ఆయన కోరారు.
