కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రం రైతు వేదికలో అధికారులు ప్రజాప్రతినిధులతో జడ్పిటిసి మడుగుల రవీందర్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జడ్పిటిసి మడుగుల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ గన్నేరువరం మండలంలో దశాబ్ది ఉత్సవాలు గ్రామ గ్రామాన పండుగల జరుపుకోవాలని. ప్రతి ఒక్కరూ భాగ్యస్వామ్యం అవ్వాలని అన్నారు, ఈనెల 10వ తేదీన మండల కేంద్రంలో సుపరి పాలన దినోత్సవం సందర్భంగా మూడు వేల మందితో ప్రగతి నివేదన సభ ధూంధాం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ అనంతరెడ్డి, ఎంపీడీవో స్వాతి, వైస్ ఎంపీపీ న్యాత స్వప్న సుధాకర్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంప వెంకన్న, రైతు బంధు మండల అధ్యక్షుడు బద్దం తిరుపతిరెడ్డి, సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు తీగల మోహన్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి కిరణ్మయి, ఏపీఎం లావణ్య, డిఈ, మరియు ఇతర శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
