- ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్ద రైతు మహాధర్నా
నిజామాబాద్ జిల్లా: ఆర్మూర్ మండల కేంద్రంలో, భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాలెపురాజు అధ్యక్షతన ఆర్మూర్ అసెంబ్లీ లోని రైతాంగ సమస్యలను, రైతులు ఎదుర్కుంటున్న సమస్యలను పరిస్కరించాలని కోరుతూ ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అంబేద్కర్ చౌరస్తా వద్ద రైతు మహాధర్న కార్యక్రమాన్ని నిర్వహించడమైనది.
- మహాధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బిజెపి రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలకు పండించిన ప్రతి పంట రైతులు నష్టపోయి దిక్కుతోచని స్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా సహకరిస్తుందన్న ఆశతో దీనావస్థలో ఉన్న రైతు దిగాలుగా ఎదురు చూస్తుంటే. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం ఇవేమీ తనకు పట్టనట్లుగా బీఆర్ఎస్ పార్టీని వివిధ రాష్ట్రాల్లో అభివృద్ధి చేసే విషయంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ధనాన్ని పక్క రాష్ట్రాలకు పార్టీ అభివృద్ధికై వెచ్చించి “అబ్ కీ బార్ — కిసాన్ సర్కార్” అనే నినాదంతో పొరుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సొంత రాష్ట్రమైన తెలంగాణలో రైతులు అకాల వర్షాలకు ధాన్యం మరియు వివిధ పంటలు నష్టపోయి లబోదిబో మని అంటుంటే ఇటు వైపు చూసే సమయం లేక తన కూతురి అవినీతి వ్యవహారాలను చక్కదిద్దు కోవడానికై సమయాన్ని, ధనాన్ని వృధా చేస్తున్నారని. మంత్రులు ఎమ్మెల్యేలు అవినీతిలో కూరుకపోవడంతో ఈ విషయాలను చర్చించుకోవడానికై సమయం తప్ప రైతుల యొక్క పరిస్థితులను క్షేత్రస్థాయిలో అంచనా వేయడానికై తాను గాని, తన మంత్రులు, ఎమ్మెల్యేలు గానీ చివరికి వ్యవసాయ అధికారులు సైతం పరిశీలించేటడానికై వెళ్లలేదంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి రైతులపై గాని, రైతాంగంపై గాని ఉన్నటువంటి శ్రద్ధ స్పష్టమవుతా ఉందని. అందుకే “రైతు ఏడ్చిన రాజ్యం — ఎద్దు ఏడ్చిన వ్యవసాయం” బాగుపడ్డట్టు చరిత్రలో లేదని. వెంటనే తెలంగాణ రాష్ట్రంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు ఎకరానికి 50 వేల చొప్పున నష్టపరహాన్ని ఇవ్వాలని. ఎన్నికల సమయంలో ఏదైతే రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు దానిని వెంటనే అమలు పరచాలని, అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని తరుగు లేకుండా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని. అదేవిధంగా రైస్ మిల్లులో సైతం తేమా,తాలు అనుకుంటూ తరుగు తీసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతుల సమస్యలను పరిస్కరించనట్లయితే రాబోయే కాలంలో ఈ రైతులతోనే ఉద్యమ కార్యాచరణను చేపట్టి రాబోయే ఎన్నికలలో రైతులతోనే బీఆర్ఎస్ పార్టీకి గుణపాఠం నేర్పిస్తామని హెచ్చరించడమైనది. కార్యక్రమానంతరం ఆర్మూర్ తహసిల్దార్ గారికి రైతుల సమస్యలను, రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలుపుతూ వినతి పత్రాన్ని ఇవ్వడమైనది.