కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు మార్కొండ రమేష్ పటేల్ ఆధ్వర్యంలో మండల కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మానకొండూరు నియోజకవర్గ ఇన్చార్జ్ గడ్డం నాగరాజు, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు మియాపురం లక్ష్మణ చారి హాజరై మాట్లాడారు బీసీలకు బీసీ బందు, ఓబీసీలకు బీసీ కార్పొరేషన్ నిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఈనెల తొమ్మిదవ తేదీన ఓబిసి మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నా కార్యక్రమము ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు రావుల శంకరాచారి, బీజేపీ మండల అధ్యక్షులు రాపాక ప్రవీణ్ ఓ బి సి మండల ప్రధాన కార్యదర్శి ఎదులాపురం అశ్వంత్ తేజ, సాయికుమార్, ఉపాధ్యక్షులు పోచంపల్లి శ్రీనివాస్, ఉషకోయిల శ్రీనివాస్, సోన్నాకుల శ్రీనివాస్, బాషబోయిన ప్రదీప్ యాదవ్, అడప రవి, రావుల తిరుపతి, పాల్గొన్నారు.
