మంచిర్యాల జిల్లా :బెల్లంపల్లి పట్టణం రైల్వే స్టేషన్ సమీపంలో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత శ్రీధర్, కౌన్సిలర్ చంద్ర శేఖర్ అధ్వర్యంలో బస్తి వాసుల సహకారంతో నూతనంగా నిర్మించిన పోచమ్మ దేవాలయం లో సోమవారం భూలక్ష్మి,మహాలక్ష్మి,పోచమ్మ, బొడ్రాయి,మైసమ్మ అమ్మవార్ల విగ్రహాల ప్రతిష్టాపన మహోత్సవం వైభవంగా జరిగింది, ఈకార్యక్రమానికి ముఖ్య అతితులుగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జిల్లా గ్రంథాలయసంస్థ ఛైర్మన్, రేణికుంట్ల ప్రవీణ్ హాజరయ్యారు.అమ్మవార్లను దర్శించుకునీ నియోక వర్గంలోని ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బోడ్డు నారాయణ, గెళ్ళి రాజాలింగ్ , బిఆర్ఎస్ నాయకులు శ్రీధర్, యూత్ ప్రధాన కార్యదర్శి శ్యామ్, పట్టణ యువజన సన్ని, యువజన నియోజక వర్గ అధ్యక్షుడు మహేష్, యాదగిరి, వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.