పార్వతీపురం మన్యం జిల్లా: గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గిరిజన విద్యార్థి సంఘం నాయకులు పార్వతీపురం ఐటిడిఏ ఏపీవో పి. మురళీధర్ కి వినతి పత్రం అందజేశారు. గిరిజన విద్యార్థి సంఘం అధ్యక్షులు పల్ల సురేష్ మాట్లాడుతూ, పార్వతీపురం మండలం రావికోనలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల బాలుర వసతి గృహంలో విద్యార్థులకు మంచి నీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే విజయనగరం ఉమ్మడి జిల్లాలోని మెంటాడ మండలం ఆండ్ర గిరిజన సంక్షేమ ఆశ్రమ హాస్టల్‌లో తరగతి గదులు లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, అదనపు భవనాలను తక్షణమే నిర్మించాలని డిమాండ్ చేశారు.ఈ సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని పల్ల సురేష్ ఐటిడిఏ ఏపీవోను కోరారు. ఈ సమస్యలపై అధికారులు సానుకూలంగా స్పందించి, పరిష్కారానికి హామీ ఇచ్చారని ఆయన తెలిపారు.