పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణం పిల్లుట్ల రోడ్డులోని స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘమైన TNTUC ఆధ్వర్యంలో “మేడే” వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నుండి 200 మోటారు సైకిళ్ళు, 200 ఆటోలతో TNTUC కార్మికులు, పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీగా పిల్లుట్ల రోడ్డుకు చేరుకొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గురజాల మాజీ శాసనసభ్యులు శ్రీ యరపతినేని శ్రీనివాసరావు పాల్గొని TNTUC జెండాను ఆవిష్కరించడం జరిగింది. TNTUC నాయకులు, స్వర్గీయ నందమూరి తారకరామారావు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించటం జరిగింది. అనంతరం పిల్లుట్ల రోడ్డు లోని షాదీఖానా లో టిఎన్టియుసి ఆధ్వర్యంలో నిర్వహించిన సభలో యరపతినేని శ్రీనివాసరావు ,కార్మికులు, టిఎన్టియుసి విభాగం వారు, కార్యకర్తలు పాల్గొనడం పాల్గొన్నారు.












