పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ : విజయవాడ, ధర్నా చౌక్ లో ఈనెల 15 న జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు పిడుగురాళ్ల పిలుట్ల రోడ్డు జెండా చెట్టు వద్ద మధ్యాహ్నం 12 గంటలకు ప్రజా సంఘాలు, మరియు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కరపత్రావిస్కరణ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పిడిఎం రాష్ట్ర అధ్యక్షులు కే శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం పౌరులందరికీ జీవించే హక్కు, మాట్లాడే హక్కు, లాంటి అనేక హక్కులు రాజ్యాంగం కల్పించింది అయితే నేడు కేంద్రంలో బిజెపి పార్టీ పౌరుల యొక్క ప్రాథమిక హక్కులను అణిచివేయడానికి ఉపా ,ఎన్ ఐ ఏ. లాంటి దుర్మార్గపు చట్టాలను విచ్చలవిడిగా ఉపయోగిస్తూ అక్రమంగా అనేకమందికి మేధావులను అరెస్టు చేసి బెయిల్ కూడా రాకుండా జైల్లో నిర్బంధిస్తున్నారు వెంటనే ప్రజాస్వామిక వాదులు మేధావులపై పెట్టిన “ఊపా” కేసులను ఎత్తివేయాలని ఎన్. ఐ. ఏ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎం సి పి ఐ జిల్లా అధ్యక్షులు కృష్ణ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టి దేశ సంపదను సహజ వనరులను ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ ప్రజలందరికీ స్వేచ్ఛ సమానత్వం సామాజిక గౌరవం కోసం పోరాడుతున్న మేధావులను “ఊపా” లాంటి క్రూరమైన చట్టాలను ఉపయోగించి వారిని జైళ్లకు అంకితం చేస్తున్నారు ఇటువంటి దుర్మార్గపు ప్రజా వ్యతిరేక విధానాలను దేశంలోని ప్రతి పౌరుడు వ్యతిరేకించాలని దానిలో భాగంగా ఈ నెల 15 శనివారం 10 గంటలకు విజయవాడ ధర్నా చౌక్ లో జరిగే ధర్నా కార్యక్రమంలో ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, బుద్ధి జీవులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సి. టి. యు నాయకులు నారాయణ ,ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
