చేగుంట/ తూప్రాన్ డివిజన్: మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని చేగుంట మండలం కేంద్రంలో అదనపు కలెక్టర్ నగేష్, తహసీల్దార్ కార్యాలయంలో ర్యాలయంలో సమావేశ నిర్వహించి గ్రామ పాలన అధికారుల పనితీరు, సాదా బై నామ ఎంక్వైరీ పటిష్టంగా అమలు చేయాలని, తాసిల్దార్ కార్యాలయం ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు, అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యాలయ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని, తహసీల్దార్ కార్యాలయంలో భూ సమస్యలపై పరిష్కారానికి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. మోడ్యూల్ లో ఉన్న అన్ని రకాల దరఖాస్తులను పెండింగ్ లేకుండా పరిష్కరించాలని , అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ , శివ ప్రసాద్, ఆర్. ఐ సంతోష్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
