మెదక్ జిల్లా, తూప్రాన్: బీసీ బంద్‌కు మద్దతుగా తూప్రాన్ డివిజన్‌లో అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు నిర్వహించారు. నేషనల్ హైవే 44 పై చిన్న శంకరంపేట, నార్సింగ్, చేగుంట, తూప్రాన్ మండలాలలో రాస్తారోకో చేసి బీసీల హక్కుల కోసం నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా దాదాపు కిలోమీటర్ మేరకు వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ పూర్తిగా స్థంభించిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనంతరం పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేశారు.
ఈ కార్యక్రమానికి పలు సంఘాల నాయకులు మద్దతు ప్రకటించారు. ముఖ్యంగా చిటమిల నాగరాజు, దుంపల శ్రీనివాస్, మాల మహానాడు నాయకుడు ఉదండపురం నరసింహులు వంటి ప్రముఖులు పాల్గొన్నారు. మైనారిటీలలో కుల, మత భేదం లేకుండా పలు గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు.
బీసీ హక్కుల సాధన కోసం చేపట్టిన ఈ ఉద్యమం నేపథ్యంలో, ప్రభుత్వం స్పందించాలని నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యమం ఇంకా కొనసాగుతుందా లేదా అన్నది అధికారుల చర్యలపై ఆధారపడి ఉంటుంది.