తూప్రాన్ డివిజన్ : మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పోలీస్ కార్యాల యంలో డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో సబ్ డివిజన్‌కు చెందిన అందరు సీఐలు మరియు ఎస్సైలతో సమావేశం నిర్వహించారు. అక్టోబర్ నెలలో నమోదైన అన్ని కేసులను తూప్రాన్ డిఎస్పి పరిశీలించారు. అదేవిధంగా ఇంకా చాలా రోజులుగా పెండింగ్‌లో ఉన్న విచారణ కేసులు, అమలు కాని NBWs, అలాగే ప్రాపర్టీ ఆఫెన్సెస్ డిటెక్షన్‌పై కూడా వివరంగా మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ప్రమాదాలు జరుగుతున్న చోట్ల పర్యవేక్షణ పెంచడం, CC కెమెరాలు ఏర్పాటు చేయడం, మరియు రోడ్డు భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలను డీఎస్పీ నరేందర్ గౌడ్ సూచించారు. ముఖ్యంగా
పోలీస్ స్టేషన్లలో రికార్డులు సరిగా నిర్వహించడం, కేసుల విచారణను వేగంగా పూర్తి చేయడం, ప్రజల భద్రతను మెరుగుపరచడం కోసం అధికారులు తమ పనిని మరింత క్రమబద్ధంగా చేయాలని డీఎస్పీ ఆదేశించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని శాంతి భద్రతల కోసం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.









