చిన్న శంకరంపేట/మెదక్ తూప్రాన్ డివిజన్ :మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని శంకరంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో జరిగిన మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అదనపు కలెక్టర్ నగేష్ తో హాజరయ్యారు అనంతరం
మెదక్ జిల్లాకు సంబంధించి 30 కోట్ల రూపాయలు నియోజకవర్గానికి సంబంధించి రెండు కోట్ల 88 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు.చిన్న శంకరంపేట మండలంలోని కోరిపల్లి గ్రామానికి చెందిన లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి నిదర్శనంగా మరోసారి రాష్ట్రంలోని మూడు లక్షల 50 వేల స్వయం సహాయక మహిళా సంఘాలకు 304 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం అందించనున్నది.
ఇందుకుగాను మంగళవారం ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగావడ్డీ లేని రుణాలను మూడో విడత అందించేందుకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండుసార్లు వడ్డీ లేని రుణాలను ఇచ్చిన విషయం తెలిసిందే. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని వారి కాళ్ళ మీద వారిని నిలబడేలా తీర్చిదిద్ది కుటుంబాలను అభివృద్ధి చేసేందుకు, తద్వారా మహిళలు ఆర్థికంగా ఎదిగి స్వయం సమృద్ధి సాధించేందుకు చర్యలు తీసుకుంటా మన్న ప్రజా ప్రభుత్వ హామీ మేరకు మహిళలకు అన్ని రంగాలలో అవకాశాలు కల్పిస్తున్నది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది. జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడుతూ మహిళా సంఘాల కు పాఠశాల విద్యార్థుల యూనిఫామ్స్ కుట్టే పనిని, అమ్మ ఆదర్శ పాఠశాల పనులను అప్పగించింది. బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలను కల్పించడం, ఇటీవల కాలంలో పెట్రోల్ బంకుల నిర్వహణను కూడా మహిళలకు అప్పగించింది. అంతేకాక ప్రతి జిల్లా కేంద్రంలో ఎంపిక చేసిన ప్రాంతాలలో మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేయడమే కాకుండా వికలాంగులు జెండర్ సమస్యల కోసం సామాజిక కార్యక్రమాల నిర్వహణను గ్రామ సంఘాలకు మండల సమాఖ్యలకు భవనాల నిర్మాణం వంటి అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం కల్పిస్తున్నది ఇందులో భాగంగానే ప్రతి సంవత్సరం మహిళలకు వడ్డీ లేని రుణాలను పెద్ద మొత్తంలో ఇస్తున్నారాని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.










