contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు వెంటనే ప్రారంభించాలి

చేగుంట తూప్రాన్ డివిజన్ : మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని చెగుంట మండలంలో నిర్మాణంలో ఉన్న Railway Over Bridge (ROB) పనులను వేగవంతం చేయుటకు ఈ రోజు RDO కార్యాలయంలో R&B, TRANSCO, Forest, Mission Bhagiratha మరియు పోలీసు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఫారెస్ట్: ROB పనులకు అవసరమైన చెట్ల తొలగింపు విషయంలో, అవసరమైన వ్యయాన్ని రైల్వే శాఖ భరించాలి అని తెలిపారు. దీనికి అనుగుణంగా రైల్వే అధికారి చర్యలు తీసుకొని వెంటనే పని ప్రారంభించాలని సూచించారు.
మిషన్ భగీరథ : ROB పనుల ప్రాంతంలో ఉన్న వాటర్ పైప్‌లైన్‌ విషయంలో, Mission Bhagiratha అధికారులు రైల్వే అధికారులతో కలిసి joint inspection నిర్వహించాలి.
పైప్‌లైన్‌ను సురక్షితంగా మూసివేయడం, మరియు పనులు జరుగుతున్న సమయంలో ఎటువంటి అంతరాయం లేదా సమస్యలు తలెత్తకుండా చూడాలని RDO ఆదేశించారు.

TRANSCO శాఖ:
ROB నిర్మాణానికి అడ్డుగా ఉన్న *విద్యుత్‌ ధృవాలు (current poles)*ను తొలగించి, అవసరమైన shifting మరియు line diversion‌ను వేగంగా పూర్తి చేయాలని TRANSCO అధికారులను ఆదేశించారు. పనుల్లో ఆలస్యం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Police శాఖ – Traffic Management:
నిర్మాణ పనుల సమయంలో ప్రజలకు అసౌకర్యం కలగకుండా, అవసరమైన traffic diversion ప్లాన్ సిద్ధం చేసి అమలు చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్‌కు RDO జయ చంద్రా రెడ్డి సూచించారు. స్థలాన్ని సందర్శించి ప్రత్యామ్నాయ మార్గాలు సూచించాల్సిందిగా ఆదేశించారు.

ఈ సమావేశం లో జె .నరేందర్ గౌడ్ DSP, తూప్రాన్ , పి.వేణు EE (R&B), సంపత్ కుమార్ EE (మిషన్ భగీరథ), పి . శ్రీనివాస్ విజయ్ (ట్రాన్సో), సమీర్ కుమార్ (రైల్వే GS SCR), తహసీల్దార్ చేగుంట, SI, Chegunta, దివ్య శ్రీ, మిషన్ భగీరథ (intra) , విజయ సారథి, AEE (R&B) మరియు ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :