తూప్రాన్ డివిజన్ : తూప్రాన్ డివిజన్‌లో ఇటీవల నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా విజయం సాధించిన సర్పంచులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. బీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో ఉన్న అపారమైన విశ్వాసానికి ఈ ఎన్నికల ఫలితాలే స్పష్టమైన నిదర్శనమని పార్టీ నాయకులు పేర్కొన్నారు.
ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని అనేక గ్రామాలు పదేళ్లు వెనక్కి వెళ్లిన పరిస్థితి నెలకొందని, గ్రామాల అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ గారి పాలనలో గ్రామాలు అన్ని రంగాల్లో ఎలా అభివృద్ధి చెందాయో ప్రజలు మర్చిపోలేదని, అందుకే సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలు ఏకతాటిపై నిలిచి అధిక సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి ఘన విజయం అందించారని తెలిపారు.
“కేసీఆర్ గారు వస్తేనే గ్రామాలు బాగుంటాయి. గ్రామాలు బాగుంటేనే ప్రజలు బాగుంటారు. గ్రామాలు పరిశుభ్రంగా, అభివృద్ధి పథకాలతో ముందుకు సాగుతాయి” అనే నమ్మకంతోనే ప్రజలు ఈ తీర్పు ఇచ్చారని అన్నారు.
ఈ విజయం పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపిందని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ గారి పాలనే రాష్ట్రంలో కొనసాగుతుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. అప్పటితో తెలంగాణలోని అన్ని గ్రామాలు మళ్లీ అభివృద్ధి బాట పట్టి పరిశుభ్రంగా మారతాయని వారు స్పష్టం చేశారు.










