తూప్రాన్ డివిజన్ : దుబ్బాక నియోజకవర్గం దౌల్తాబాద్ మండలంలోని ఇందుప్రియల్ గ్రామం, లింగాయపల్లి తండా గ్రామాల్లో ఇటీవల నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన నూతన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లను దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల విశ్వాసంతో గెలుపొందిన ప్రజాప్రతినిధులు గ్రామాభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ఐక్యతతో పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు విషయంలో ప్రజాప్రతినిధులు కీలక పాత్ర పోషించాలని ఆయన అన్నారు.
ప్రతి గ్రామ అభివృద్ధికి తన పూర్తి సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.










