మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట మండల కేంద్రానికి చెందిన రంగారెడ్డి ఇటీవల TPUS (తెలంగాణ ప్రోగ్రెసివ్ ఉపాధ్యాయ సంఘం) రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ZPHS మాసాయిపేటలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయునిగా సేవలందిస్తున్నారు.
రంగారెడ్డి గతంలో ఉమ్మడి వెల్దుర్తి–చేగుంట మండల అధ్యక్షునిగా పనిచేసి, అనంతరం తూప్రాన్ డివిజన్ కన్వీనర్‌గా TPUS సంఘానికి విశేష సేవలు అందించారు. సంఘ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ముందుండే నాయకుడిగా ఆయనకు గుర్తింపు ఉంది.
ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ, TPUS సంఘ అభివృద్ధికి, ఉపాధ్యాయుల హక్కులు, సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం అందిస్తూ నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
రంగారెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమితులైన సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎల్లం, ప్రధాన కార్యదర్శి సిద్ధయ్య, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు స్వప్నశ్రీ, తూప్రాన్ మండల అధ్యక్షులు సంతోష్, మాసాయిపేట మండల అధ్యక్షులు భద్రయ్య, ప్రధాన కార్యదర్శి ఝాన్సీ తదితరులు ఆయనను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.










