మాసాయిపేట / తూప్రాన్ : మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని మాసాయిపేట గ్రామంలో శనివారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. తూప్రాన్ నుంచి చేగుంట వైపు వెళ్తున్న ఆటోను, హైదరాబాద్ నుంచి నిజాంబాద్ వైపు వెళ్తున్న లారీ వెనుక నుంచి ఢీకొట్టిన ఘటన బంగారమ్మ టెంపుల్ సమీపంలో జరిగింది.
శనివారం రాత్రి సుమారు 7:30 గంటల సమయంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను లారీ బలంగా ఢీకొనడంతో ఆటో పల్టీ కొట్టి రోడ్డుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు మరియు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని అంబులెన్స్ ద్వారా సమీప ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.







