మెదక్ జిల్లా – నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. నర్సాపూర్, కొండాపూర్, శివ్వంపేట మండలాల పరిధిలోని ఉసిరికపల్లి గ్రామాల్లో జరిగిన ఈ కార్యక్రమాలకు ఆయన హాజరై లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
కొత్త ఇంటిలో అడుగుపెట్టిన ప్రతి కుటుంబం ఆనందంగా, సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత చేరువ కావాలని, ప్రతి అర్హులైన కుటుంబానికి అందేలా కృషి చేస్తామని తెలిపారు. గృహనిర్మాణం ద్వారా పేదలకు స్థిరమైన నివాసం కల్పించడం ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు.
అనంతరం నర్సాపూర్ మండలం రామచంద్రపురం గ్రామంలో నిర్వహించిన శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవ కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దేవస్థానంలో నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో గ్రామస్థులతో కలిసి ప్రార్థనలు చేశారు.
ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాలు ఉత్సాహభరిత వాతావరణంలో సాగాయి.








