మెదక్ తూప్రాన్ డివిజన్ :హోళీ పండుగను పురస్కరించుకుని నూతన జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. రంగుల పండుగగా ప్రసిద్ధి చెందిన హోళీ, రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒక్కచోట చేర్చే ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, హోళీ పండుగ ప్రతి కుటుంబంలో ఆనందం, ఉత్సాహం, సంతోషాల వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. జిల్లా ప్రజలందరూ పరస్పర సౌహార్దంతో, ఆనందోత్సాహాలతో హోళీ వేడుకలను జరుపుకోవాలని అభిలషించారు.
అలాగే సహజ రంగులను వినియోగిస్తూ పర్యావరణ హితంగా, సంప్రదాయబద్ధంగా హోళీ వేడుకలను నిర్వహించుకోవాలని సూచించారు. సమాజంలో ఐక్యత, స్నేహభావం మరింత బలపడేలా ఈ పండుగను సార్థకం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.








