contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

మార్చ్ ఒకటి నుండి జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు

మెదక్ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా మార్చి 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీస్ యాక్ట్ – 1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు తెలిపారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్, సభలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమని స్పష్టం చేశారు. చట్టవ్యతిరేక చర్యలు, అశాంతి సృష్టించే ప్రయత్నాలు, ప్రజా లేదా ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని హెచ్చరించారు.

శాంతి భద్రతల నిర్వహణలో ఎవరైనా విఘాతం కలిగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీస్ శాఖ చేపడుతున్న చర్యలకు సహకరించి జిల్లాలో ప్రశాంత వాతావరణం కొనసాగించేందుకు సహకరించాలని ఎస్పీ డి.వి. శ్రీనివాస్ రావు కోరారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :