- లారీ స్వాధీనం… డ్రైవర్ నగేష్, యజమాని భాస్కర్‌పై కేసు నమోదు
తూప్రాన్ :తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా రవాణా అవుతున్న సుమారు 360 క్వింటాళ్ల పీడీఎస్ (పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్) బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
హైదరాబాద్ వైపు నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న ఒక లారీలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని పోలీసులు గుర్తించారు. తనిఖీలలో భాగంగా పరిశీలించగా సరైన అనుమతులు మరియు పత్రాలు లేకుండా బియ్యాన్ని ఇతర ప్రాంతానికి తరలిస్తున్నట్లు వెల్లడైంది.
లారీ డ్రైవర్ నగేష్ మరియు బియ్యానికి సంబంధిత యజమాని భాస్కర్‌పై సివిల్ సప్లై అధికారులు ఆర్‌ఐ నర్సింలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సుమారు 360 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకొని లారిని సీజ్ చేశారు.
ఈ ఘటనపై సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.








