మాసాయిపేట, తూప్రాన్ డివిజన్ : మాసాయిపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద బుధవారం తై బజార్ వేలం నిర్వహించారు. సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేలం కార్యక్రమంలో చిట్టిమిల్ల సిద్దిరాములు రూ.2,83,000కు తై బజార్ హక్కులను దక్కించుకున్నారు.
ఈ వేలాన్ని సర్పంచ్ వీరన్న గారి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించగా, గ్రామంలో వ్యాపార నిర్వహణ, మార్కెట్ వ్యవస్థకు సంబంధించిన అంశాలపై చర్చ జరిగింది.
గత దశాబ్దకాలంగా మాసాయిపేటలో తై బజార్ నిర్వహణపై వివిధ అభిప్రాయాలు, అధికారులతో చర్చలు కొనసాగినట్లు స్థానికులు తెలిపారు. పేద రైతులు, చిన్న వ్యాపారులు ఇబ్బందులు పడకుండా గ్రామాభివృద్ధి దిశగా నిర్ణయాలు తీసుకున్నట్లు గ్రామ పెద్దలు పేర్కొన్నారు.
కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దాదాపు పది సంవత్సరాల అనంతరం తై బజార్ కూరగాయల మార్కెట్ వేలం తిరిగి ప్రారంభం కావడం విశేషంగా మారిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
ఈ సందర్భంగా గ్రామంలో మౌలిక సదుపాయాలు, మార్కెట్ అభివృద్ధిపై కూడా చర్చ జరిగింది. తై బజార్ పరిధిలో అన్ని అవసరమైన సౌకర్యాలు కల్పించాలని గ్రామ ప్రజలు సర్పంచ్‌తో పాటు ఎంపీడీవోకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పసుల వెంకటేశం, విఘ్నేశ్వర్, ఎంపీఓ నరేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి రాణిమ, వార్డు సభ్యులు ఎర్ర స్వామి, జంగిటి కొండయ్య, ధనరాజ్, మాజీ పిఎసిఎస్ డైరెక్టర్ ఊదండపురం నరసింహులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ నాగిరెడ్డి, ముక్క దశరథ, దుంపల జైలు, దుంపల శ్రీనివాస్ తదితర గ్రామ పెద్దలు పాల్గొన్నారు.








