contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

BJP Party : రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా రామ్మోహన్ గౌడ్ నియామకం

తూప్రాన్ డివిజన్ : భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియమితులైన తూప్రాన్ గ్రామానికి చెందిన వర్గంటి రామ్మోహన్ గౌడ్ మర్యాదపూర్వకంగా పార్టీ ముఖ్య నాయకులను కలిశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో సంఘటనా ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ జిని కలిసిన ఆయనకు శాలువా కప్పి సన్మానం చేశారు. అలాగే తనకు రాష్ట్ర స్థాయి బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

ఈ విషయాన్ని వెల్లడించిన వర్గంటి రామ్మోహన్ గౌడ్, పార్టీ ఇచ్చిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహించి, సంస్థ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :