తూప్రాన్ డివిజన్, మెదక్ జిల్లా: మాసాయిపేట మండల కేంద్రంలో మహంకాళి బోనాల జాతర ఉత్సవాలు ఆద్యంతం ఘనంగా జరిగాయి. మాజీ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ మహంకాళి బోనాల జాతర రాజకీయ పార్టీలకు అతీతంగా, సామాజిక ఐక్యతను ప్రతిబింబిస్తూ జరిగింది అన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా పాల్గొని జాతరను మరింత శోభాయమానంగా మార్చారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో చేగుంట పోలీసులు బందోబస్తు నిర్వహణలో పాల్గొని శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారికి బోనాలు సమర్పించగా, గ్రామంలో ఉత్సాహపూరిత వాతావరణం నెలకొంది.