మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని మాసాయిపేట గ్రామంలో గ్రీన్ హౌస్ పార్క్ లో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు పుటం పురుషోత్తం రావు,పెద్ది పెంటయ్య, కల్లూరి హనుమంతరావు అపెక్స్ కమిటీ కన్వీనర్ మీసాల చంద్రయ్య రాష్ట్ర కార్యవర్గం భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలో సమాలోచించారు.అలాగే సభ్యత్వం ప్రతి ఒక్కరు 100 రూపాయల సభ్యత్వం చెల్లించాలని 33 జిల్లాలలో అమలు చేయాలని ఇప్పటివరకు 18 జిల్లాలలో సభ్యత్వం కావడం జరిగిందని అలాగే మిగతా జిల్లాల్లో సభ్యత్వ కార్యక్రమాన్ని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు త్వరలోనే పూర్తి చేయాలని రాష్ట్ర అధ్యక్షులు సూచించారు. మున్నూరు కాపులందరూ సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ఐకమత్యంగా ఉండి కృషి చేయాలని విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో రాణించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సంఘం నాయకులు సత్తా చాటాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా తరఫున జిల్లా గౌరవ అధ్యక్షులు మామిండ్ల అంజయ్య,రాష్ట్ర కార్యదర్శి నీలం నరసింహులు రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ అయినటువంటి మామిళ్ల లింగం,కాసర్ల రవీందర్ అలాగే రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
