మెదక్ జిల్లా – తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో రైతు బండ్ల గణేష్ యాదవ్ కు చెందిన గొర్రెల మందపై శనివారం అర్థరాత్రి కుక్కల గుంపు దాడి చేసింది. ఈ దాడిలో 12 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. సుమారు రెండు లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు. ఈ సంఘటనను పరిశీలించిన రెండవ వార్డు మాజీ కౌన్సిలర్ మామిడి వెంకటేష్ మాట్లాడుతూ… ప్రభుత్వం వెంటనే బాధిత రైతుకు ఆర్థిక సాయం అందించాలని కోరారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసు కున్నప్పటికీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, ఇకనైనా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు.
