రామాయంపేట/తూప్రాన్ డివిజన్ : మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని రామాయంపేట ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 15 రిటైల్ మద్యం దుకాణాల కేటాయింపునకు నోటిఫికేషన్ విడుదలైంది.
ఈ సందర్భంగా ఎక్సైజ్ శాఖ అధికారికంగా తెలిపిన వివరాల ప్రకారం:
లైసెన్స్ వ్యవధి: 1 డిసెంబర్ 2025 నుంచి 30 నవంబర్ 2027 వరకు.
దరఖాస్తు చేయగల వారు: కనీసం 21 సంవత్సరాలు వయస్సు పూర్తైన ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు రుసుము: రూ. 3 లక్షలు (మళ్లీ ఇచ్చే విధంగా కాదు – non-refundable).
దరఖాస్తుల సమర్పణకు చివరి తేది: అక్టోబర్ 18, 2025.
దరఖాస్తుల స్వీకరణ మెదక్ జిల్లా DPEO కార్యాలయం, అలాగే హైదరాబాద్ లోని ప్రొహిబిషన్ & ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం లలో జరుగుతుంది.
మరిన్ని వివరాల కోసం రామాయంపేట ఎక్సైజ్ స్టేషన్‌ను సంప్రదించవచ్చని శాఖ సూచించింది.
ఇప్పటివరకు రామాయంపేటకు 6 టెండర్ దరఖాస్తులు, మొత్తం మెదక్ జిల్లాలో 16 దరఖాస్తులు అందినట్లు DPEO శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇంకా ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావాల్సిన అవకాశం ఉందని పేర్కొన్నారు.