చేగుంట/ తూప్రాన్ డివిజన్ : మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్ పరిధిలోని చేగుంట మండలం వడియారం గ్రామ శివారులోని అపోలో ట్యూబ్స్ లిమిటెడ్ పరిశ్రమ లో పనిచేస్తున్న కార్మికులు సమ్మెబాట పట్టారు, స్థానికంగా పర్మినెంట్ అయిన 69 మంది కార్మికులను అక్రమ బదిలీలను వెంటనే రద్దు చేయాలని, యాజమాన్యానికి ప్రాధే పడిన ఫలితం లేక ధర్నా చేపట్టడం జరిగింది అని అన్నారు అనంతరం మొండి వైఖరి విడనాడాలని, డిమాండ్ చేస్తూ నేడు రెండవ రోజు వంట వార్పు కార్యక్రమాన్ని చేపట్టారు, సమ్మె చేపడుతున్న కార్మికులకు భారతీయ మజ్దూర్ సంగ్ జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రదీప్ కుమార్లు సంఘీభావం తెలిపారు, పరిశ్రమలో కార్మికులకు ఎలాంటి భద్రత లేదని ఏమాత్రం నిర్లక్ష్యం చేసిన ప్రాణాలు గాలిలో కలిసి పోవాల్సిందేనని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు, చేగుంట పరిసర గ్రామాల స్థానిక పర్మినెంట్ కార్మికులను ఢిల్లీ చత్తీస్గడ్ రాష్ట్రాలకు అక్రమంగా బదిలీలను చేయడం విరమించుకోవాలని బదిలీలపై అక్కడికి వెళితే తమ భార్య పిల్లలను పోషించుకోవడం చాలా కష్టమని వారు ఆవేదన వ్యక్తం చేశారు, ఈ సందర్భంగా బిఎంఎస్ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రదీప్ కుమార్ లు మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలకు బదిలీ చేసిన కార్మికులను వెంటనే వారి బదిలీలను రద్దు చేయాలని, కార్మికులను ఎప్పుడు బయటకు పంపియాలని ఆలోచనతోనే యాజమాన్యం ఉన్నదని కార్మికుల సంక్షేమం కోసం యాజమాన్యం ఎప్పుడూ కూడా ఆలోచన చేయడం లేదని వారన్నారు, అక్రమ బదిలీలను వెంటనే రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని, శాంతియుతంగా ఆందోళన చేపట్టినప్పుడే యాజమాన్యం దిగివచ్చి కార్మికులకు న్యాయం చేయాలని లేకపోతే కార్మికుల డిమాండ్ నెరవేర్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భారతీయ మజ్దూర్ సంఘ్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రదీప్ కుమార్,జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి, జనరల్ సెక్రటరీ కుల్ల నర్సింలు, ట్రెజరర్ కుంట రాజ్ కుమార్, చవాన్ సురేష్ కుమార్, శ్రీనివాస్, నవీన్ యాదవ్, పెద్దకృష్ణ, సునీల్, పాస్వాన్, యూనియన్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
