నర్సాపూర్/ తూప్రాన్ డివిజన్ : మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ ఆవుల రాజిరెడ్డి ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో సింగూరు జలాలు విడుదల కావడంతో మంజీరా నది తీరంలో ఉన్న ప్రధాన పైప్‌లైన్ లీకేజీ కారణంగా మిషన్ భగీరథ ద్వారా నర్సాపూర్ నియోజకవర్గానికి తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో, నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకటస్వామి ని హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా, ఆవుల రాజిరెడ్డి గారు గోదావరి జలాలను కోమటిబండ ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా శివ్వంపేట సంప్‌కు మళ్లించి, నియోజక వర్గానికి తక్షణమే నీటి సరఫరా ప్రారంభించాలని మంత్రి కోరారు. మంత్రి వెంటనే స్పందించి, మూడు నుండి నాలుగు రోజుల్లో నీటిని విడుదల చేసేందుకు కావలసిన చర్యలు తీసుకోవాలని ఇంజనీర్-ఇన్-చీఫ్ (ENC) కృపాకర్ రెడ్డి కి ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయంతో నర్సాపూర్ నియోజకవర్గ ప్రజలకు పెద్ద ఊరటనిచ్చే అవకాశం ఉందని ఆవుల రాజిరెడ్డి పేర్కొన్నారు
