contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

ప్రజల వద్దకు ప్రభుత్వాన్ని తీసుకురావడమే ప్రజాపాలన: దామోదర్ రాజనర్సింహ

  • అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం.
  • అభివృద్ధి ,సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగుతాయి.
  • విద్య, వైద్య మెరుగు కోసం ప్రత్యేక దృష్టి.
  • దామోదర్ రాజనర్సింహ, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడి

 

మెదక్ : ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు తీసుకురావడం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని గత నెల 28 నుండి ఈ రోజు 6 వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మాత్యులు దామోదర్ రాజనర్సింహ అన్నారు. శనివారం మెదక్ , పట్టణం లో సాయి బాలాజీ గార్డెన్ ఏర్పాటుచేసిన 29,30,31, & 32 వార్డు లు , దుబ్బాక నియోజకవర్గం, చేగుంట గ్రామంలోను , గజ్వేల్ నియోజకవర్గం , తూప్రాన్ , 16 వ వార్డు లలో ఏర్పాటుచేసిన ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యాక్రమము ప్రజాపాలనలో ముఖ్య అతిథి ఆయన పాల్గొన్నారు . ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ సoదేశం తో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ఆరు గ్యారంటీ లతో ప్రభుత్వం ఏర్పాటు చేసిందనీ , అందులో రెండు గ్యారంటీలను ముందు గానే అమలు పరచిందనీ తెలిపారు. ఎన్నికల లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే రెండు గ్యారెంటీలను ప్రభుత్వం అమలు చేసిందన్నారు . మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. పది లక్షలకు పెంచడం ద్వారా రెండు గ్యారంటీలను ప్రభుత్వం అమలు చేసిందన్నారు మిగిలిన గ్యారెంటీలను సైతం త్వరలోనే అమలు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది అన్నారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు నిరంతరం కొనసాగుతాయన్నారు. రాష్ట్రంలో విద్య వైద్య సౌకర్యాల మెరుగుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.
అనంతరం మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావును ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ ఆయన పట్టు వదలని విక్రమార్కుడనీ. ప్రజలకు సేవ చేయాలనే సదుద్దేశం తో తను ఎంతో శ్రమించి పొందిన వైద్య వృత్తినీ సైతం వదులుకొని ప్రజల్లోకి వచ్చిన వ్యక్తి అని కొనియాడారు. మీ ఎమ్మెల్యే సారథ్యంలో నియోజకవర్గ అభివృద్ధికి సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్శిషా మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 469 గ్రామ పంచాయతీలు, 75 వార్డుల లో 1,98,000 దరఖాస్తులు ప్రజా పాలనలో ఆరు గ్యారెంటీ ల కోసం దరఖాస్తులు అందినట్లు తెలిపారు. అధికారులు ఆయా గ్రామాల అంగన్వాడి కార్యకర్తలు ఆశ వర్కర్లు , ఐకెపి సిబ్బంది అన్ని గ్రామాలలో ప్రత్యేక హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయడం ద్వారా ఇప్పటివరకు 99 శాతం దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. వచ్చిన దరఖాస్తులన్నిటిని వెంటనే ఆన్ లైన్ చేసేలా ఏర్పాట్లు ప్రక్రియ మొదలు పెట్టామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రమేష్, ప్రత్యేకాధికారి జయరాజ్ , జడ్పీసీఈఓ శైలేష్ , జామ్లానాయక్ మునిసిపల్ చైర్మన్లు చంద్రపాల్ , రావేండర్ గౌడ్ , ఆర్డిఓ లు జయచంద్రారెడ్డి , అంబదాస్ రాజేశ్వర్ , మునిసిపల్ కమిషనర్లు ,తహసీల్దార్లు , ప్రజాప్రతినిధులు , సంబంధిత అధికారులు పాల్గొన్నారు

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

 Don't Miss this News !

Share :