జగిత్యాల జిల్లా మెట్ పల్లి: మెట్ పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ చౌరస్తా వద్ద పట్టణానికి చెందిన ఓ రైతు రోడ్డు కు అడ్డంగా తన ద్విచక్ర వాహనం అడ్డుపెట్టి తనకు యూరియా బస్తా కావాలని నిరసన తెలుపుతూ ప్రభుత్వంపై వ్యతిరేకంగా విరుచుకుబడ్డాడు. గత కొద్ది రోజుల నుంచి యూరియా కోసం ఆఫీసర్ల చుట్టూ తిరిగినా గాని ఒక బస్తా కూడా ఇవ్వట్లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో కొద్దిసేపు అక్కడ ట్రాఫిక్ జాం ఏర్పడింది విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడ చేరుకొని రైతును పోలీస్ స్టేషన్ కు తరలించారు.
