contact@thereportertv.com

THE REPORTER TV
THE REPORTER TV

______ We Report India ________

రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటిన మెట్‌పల్లి అక్షర హైస్కూల్ విద్యార్థులు

మెట్‌పల్లి పట్టణంలోని అక్షర హైస్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పాఠశాలకు, పట్టణానికి మంచి పేరు తెచ్చిపెట్టారు. ఇన్‌స్పైర్ ఐఐటీ & నీట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన రాష్ట్ర స్థాయి గ్రాండ్ టెస్ట్‌లో ఈ విద్యార్థులు విశేష ఫలితాలు సాధించారు.

వివరాల్లోకి వెళితే, 3వ తరగతి నుండి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు స్టేట్ లెవల్ ఒలింపియాడ్‌లో టాపర్లుగా నిలిచారు. అలాగే 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు విద్యార్థులు ఐఐటీ & నీట్ గ్రాండ్ టెస్ట్‌లో అత్యుత్తమ స్కోర్లు సాధించి తమ ప్రతిభను నిరూపించారు.

ఈ విజయాలను పురస్కరించుకుని వరంగల్‌లోని కాళోజీ కళాక్షేత్రంలో ఇన్‌స్పైర్ ఐఐటీ & నీట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అక్షర హైస్కూల్‌కు చెందిన ఏడుగురు విద్యార్థులకు స్టేట్ లెవల్ ఇన్‌స్పైర్ ఐఐటీ ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేసి, ప్రశంసా పత్రాలు, మెడల్స్‌తో ఘనంగా సన్మానించారు.

అలాగే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నందుకు గాను అక్షర హైస్కూల్ కరస్పాండెంట్ కొత్తూరి శ్రీనివాస్‌కు “స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్” అవార్డు ప్రదానం చేసి సత్కరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి విద్యావేత్తలు, ఇన్‌స్పైర్ ఐఐటీ & నీట్ ఫౌండేషన్ ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని విజేతలను అభినందించారు. ఈ విజయాలు అక్షర హైస్కూల్ విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వానికి నిదర్శనంగా నిలిచాయి.

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

   TOP NEWS  

   Related News  

Live Sports  

 Don't Miss this News !

Share :