మాజీ ఎమ్యేల్యే సత్యనారాయణ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని మెట్రో రైల్ ఆఫీస్ వద్ద జాతీయ జండాను ఎగురవేసి పటాన్ చెరు లోని అమరులవీరుల స్తూపం వద్ద తెలంగాణ అమరులకు నివాళులు అర్పించడం జరిగింది మాజీ ఎమ్యెల్యే మాట్లాడుతూ ప్రజాభీష్ఠాన్ని గౌరవించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేసారు అమరుల త్యాగ ఫలితంగానే ఈ రోజు తెలంగాణ ప్రజలు స్వేచ్చా వాయువులు పీల్చుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రుద్రారం శంకర్. అన్వర్ పటేల్, మెట్టు శ్రీధర్, నాగసాని మాణిక్యం, కొమర గూడెం శంకర్, మహేష్ , పి.పాప రాజు, చెవ్వ రమేష్నీ,రుడి నర్సింగ్ రావు, నీరుడి రాము, మణికంఠ తదితరులు పాల్గొనడం జరిగింది.
