పార్వతీపురం మన్యం జిల్లా, కురుపాం నియోజకవర్గం, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమం మంగళవారం కురుపాం మండల రెవెన్యూ ఆఫీస్ లో ఘనంగా జరిగింది. ప్రభుత్వ విప్, కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులకు స్వయంగా స్మార్ట్ రైస్ కార్డులను పంపిణీ చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ స్మార్ట్ కార్డుల ద్వారా రేషన్ పంపిణీలో మరింత పారదర్శకత మరియు వేగం పెరుగుతాయని ఎమ్మెల్యే ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు మరియు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏఎంసి చైర్మన్ కడ్రక కళావతి,గరుగుబిల్లి ఎంపీపీ ఉరిటీ రామారావు, కురుపాం మండల కన్వీనర్ కొండయ్య, గుమ్మ లక్ష్మీపురం మండల కన్వీనర్ అడ్డా కుల నరేష్, పిఏసి చైర్మన్ లు, నాటక అకాడమీ డైరెక్టర్ అంబటి రాంబాబు,
పురుషోత్తం నాయుడు , తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అలాగ ఈ పంపిణీ కార్యక్రమానికి జిల్లా సరఫరా అధికారి తో పాటు 5 మండలాల ఎం.ఆర్.ఓ.లు, సెల్స్ మెన్ లు, కోటా డీలర్ లు, మరియు రెవెన్యూ సిబ్బంది హాజరయ్యారు. స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ కావడంతో లబ్ధిదారులు తమ రేషన్ సరకులను ఇకపై మరింత సులభంగా, డిజిటల్ పద్ధతిలో పొందడానికి వీలు కలుగుతుందిని. ఈ కార్డులపై ఉన్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా లబ్ధిదారుల పూర్తి వివరాలు, రేషన్ కేటాయింపులు తక్షణమే తీరుస్తాయని అన్నారు.
