కరీంనగర్ జిల్లా: ది రిపోర్టర్ టీవీ: సర్వాయి పాపన్న మోకు దెబ్బ జిల్లా మహిళా అధ్యక్షురాలు వడ్లకొండ అరుణ మంగళవారం తిమ్మాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో తెలంగాణ రాష్ట్ర సంస్కృతిక సారధి చైర్మన్ మానకొండూరు నియోజవర్గ ఎమ్మెల్యే డా, రసమయి బాలకిషన్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి మూడోసారి ఎమ్మెల్యే టికెట్ వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు, ఆమె మాట్లాడుతూ మానకొండూరు నియోజవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం మరోసారి ఇచ్చినందుకు సీఎం కేసీఆర్ కి, మంత్రి కేటీఆర్ కి, రుణపడి ఉంటామని, రసమయి బాలకిషన్ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా చూడాలని నియోజవర్గ ప్రజలు కోరుకుంటున్నారని,భారీ మెజార్టీతో గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కి సర్వాయి పాపన్న మోకు దెబ్బ మహిళ జిల్లా నాయకత్వం పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు.